ఇజ్రాయెల్ (Isreal) ప్రధాని బెంజిమన్ నెతన్యాహు (Benjiman Nethanyahu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ హమాస్ దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ యుద్ధాన్ని తాము మొదలు పెట్టలేదని తెలిపారు. కానీ ఈ యుద్దాన్ని ముగించిది మాత్రం తామే నంటూ హమాస్ కు హెచ్చరికలు చేశారు. ఉగ్ర సంస్థ హమాస్ చారిత్రక తప్పిదానికి పాల్పడిందని తెలిపారు.
యుద్దం నేపథ్యంలో దేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ యుద్ధంలో ఉందని చెప్పారు. తాము ఈ యుద్ధాన్ని తాము కోరుకోలేదన్నారు. అత్యంత క్రూరమైన పద్దతిలో తమపై ఈ యుద్ధాన్ని రుద్దారని వెల్లడించారు. తాము తమ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ యుద్దాన్ని ప్రారంభించింది ఇజ్రాయెల్ కాకపోయినప్పటికీ ముగించేది మాత్రమే తామేనన్నారు.
ఇజ్రాయెల్ పై దాడి చేసి చారిత్రక తప్పిదానికి పాల్పడ్డామని హమాస్ మిలిటెండ్లు చింతించే రోజు వస్తుందన్నారు. హమాస్ తో పాటు ఇజ్రాయెల్ శత్రుదేశాలకు జీవితాంతం గుర్తు వుండి పోయాలా తమ దాడి వుంటుందని ఆయన అన్నారు. హమాస్ ను ఉగ్ర సంస్థ ఐసిస్ తో ఆయన పోల్చారు. దేశ ప్రజలంతా ఏకమై హమాస్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు.
ఈ కీలకమైన సమయంలో ఇజ్రాయెల్ కు మద్దతు ప్రకటించిన అమెరికాతో పాటు ఇతర దేశాలకు నెతన్యాహూ ధన్యవాదాలు తెలిపారు. ఈ యుద్దంలో ఇజ్రాయెల్ కేవలం తన పౌరుల కోసం మాత్రమే పోరాడటం లేదన్నారు. క్రూరత్వానికి వ్యతిరేకంగా నిలబడిన ప్రతి దేశానికి మద్దతుగా ఇజ్రాయెల్ ఈ యుద్దం చేస్తోందన్నారు. ఈ యుద్ధంలో తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.