Telugu News » TTD : తిరుమలలో విశేష ఉత్సవాలు.. ఈనెల షెడ్యూల్ విడుదల!

TTD : తిరుమలలో విశేష ఉత్సవాలు.. ఈనెల షెడ్యూల్ విడుదల!

ఈనెలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇవిగాక, మరికొన్ని విశేష ఉత్సవాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది టీటీడీ.

by admin
TTD: Ugadi beauty in temples.. special ceremony in Tirumala..!

కలియుక దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమల (Tirumala) పుణ్యక్షేత్రంలో ఇటీవలే సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరిగాయి. లక్షలాది మంది భక్తులు హాజరై.. గోవిందుడి సేవలో తరించారు. అయితే.. ఈ ఏడాది అధిక మాసం ప్రత్యేకం కావడంతో తిరుమలలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈనెలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇవిగాక, మరికొన్ని విశేష ఉత్సవాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది టీటీడీ (TTD).

ఈనెలలో నిర్వహించే ఉత్సవాలు

అక్టోబర్ 1: బృహత్యుమావ్రతం(ఉండ్రాళ్ల తద్దె)
అక్టోబర్ 3: మధ్యాష్టమి
అక్టోబర్ 10: మాతత్రయ ఏకాదశి
అక్టోబర్ 13: మాస శివరాత్రి
అక్టోబర్ 14: మహాలయ అమావాస్య, తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, వేదాంత దేశిక ఉత్సవం ప్రారంభం
అక్టోబర్ 15: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
అక్టోబర్ 19: నవరాత్రి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ
అక్టోబర్ 20: నవరాత్రి బ్రహ్మోత్సవాలలో పుష్పక విమానం, సరస్వతి పూజ
అక్టోబర్ 21: దేవి త్రిరాత్ర వ్రతం, సేనై ముదలియార్ వర్ష తిరు నక్షత్రం
అక్టోబర్ 22: నవరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వర్ణ రథోత్సవాలు, దుర్గాష్టమి
అక్టోబర్ 23: నవరాత్రి బ్రహ్మోత్సవాలలో చక్ర స్నానం, మహర్నవమి మరియు విజయ దశమి, వేదాంత దేశిక సత్తుమొర, పిళ్లై లోకాచార్య పోయిగై ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం
అక్టోబర్ 24: పూద ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం
అక్టోబర్ 25: మాతత్రయ ఏకాదశి, పెయ్యాళ్వార్ వర్ష తిరునక్షత్రం
అక్టోబర్ 28: పాక్షిక చంద్ర గ్రహణం
అక్టోబర్ 31: చంద్రోదయోమ వ్రతం (అట్ల తద్దె)

You may also like

Leave a Comment