సినిమా ఇండస్ట్రీలో వ్యక్తులు ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడం కొత్త కాదు. ఇది ఇప్పటి నుంచే కాదు. చాలా కాలం నుంచే కనిపిస్తూ ఉంది. అలనాటి టాలెంటెడ్ సింగర్ ఘంటసాల కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే.. ఆయన మొదటి భార్య సావిత్రి మాత్రం రెండవ భార్య, పిల్లల గురించి బయటి వారికి తెలియకుండా ఉండాలని చాలానే జాగ్రత్త పడేది. ఈ విషయంలో ఘంటసాల చాలా బాధపడ్డారు. ఆయనకు ఇద్దరు భార్యలు, పిల్లలు కలిసి ఒక చోట ఉండాలని ఉండేది.
మొదటి భార్యకు ఐదుగురు సంతానం కాగా, రెండవ భార్య సరళకు ముగ్గురు సంతానం. సరళ.. ఘంటసాల ఇంటి పక్కన వాటాలోనే ఉండేవారు. ఓ సారి సావిత్రి సరళకి పరిచయం కాగా.. సావిత్రినే సరళను ఘంటసాలకు పరిచయం చేసింది. క్రమంగా రెండు ఇళ్ల మధ్య రాకపోకలు సాగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే సరళతో ఘంటసాల పరిచయం ప్రేమగా మారింది. సరళ తనను పెళ్లి చేసుకోమని ఘంటసాలని కోరడంతో ఆయన ఆలోచనలో పడ్డారు. గతంలో కూడా ఘంటసాల ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారు. అయితే..ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో ఆమె ఆ*త్మ*హ*త్య చేసుకుంది.
ఇప్పుడు అదే ప్లేస్ లో సరళ కనిపించడంతో ఆయన భయపడి సరళను పెళ్లి చేసుకున్నారు. కానీ, రెండవ పెళ్లి చేసుకున్న తరువాత ఆయన మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన కుమార్తె డా.శ్యామల పేర్కొన్నారు. ఆమె తన తండ్రి గురించి అందరికి తెలియాలన్న ఉద్దేశ్యంతో ఓ ఆన్ లైన్ పత్రికలో సీరియల్ లా రాసేవారు. అయితే.. దీనిని ఘంటసాల మొదటి భార్య అడ్డుకున్నారు. ఈ సీరియల్ ను ఆపేయించారు. కానీ శ్యామల అక్కడితో ఆగలేదు. జీవిత కథలు వాస్తవిక జీవితాన్ని ప్రతిబింబించాలి అని పేర్కొంటూ కోర్టులో కేసు వేసి గెలిచారు. ఆ తరువాత ఈ సంకలనాన్ని “నేనెరిగిన నాన్నగారు” అనే పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకంలో రెండవ పెళ్లి చేసుకున్నాక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని పేర్కొన్నారు.