చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ ఏపీ (Andhra Pradesh) రాజకీయాల్లో చాలా మార్పులే తీసుకొచ్చింది. ఇన్నాళ్లూ అనుమానాలకే పరిమితమైన టీడీపీ (TDP), జనసేన (Janasena) పొత్తు ఈ అరెస్ట్ తో ఖరారైంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ (YCP) ని గద్దె దించడమే లక్ష్యం అంటూ ఇరు పార్టీల నేతలు వ్యూహ రచనల్లో ఉన్నారు. ఇటు చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ ఆయన అభిమానులు అనేక నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయితే.. వారిపై అధికార వైసీపీ శ్రేణులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.
చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ.. టీడీపీ కార్యకర్తలు శ్రీకాకుళం నుండి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర పుంగనూరు నియోజకవర్గానికి చేరుకుంది. అయితే.. పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద ఆగిన వారు టీ తాగుతుండగా స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandrareddy) అనుచరుడు రెచ్చిపోయాడు. ఎక్కడికొచ్చి ఏం చేస్తున్నార్రా అంటూ బండ బూతులు తిడుతూ నోటికొచ్చింది వాగాడు. దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ట్వీట్ చేశారు.
‘‘సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమే! పాపాల పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అహంకారం నెత్తికెక్కిన పెద్దిరెడ్డి అనుచరుడు సూరి పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద శ్రీకాకుళం నుండి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించి, జెండాలు పీకి దాడికి పాల్పడ్డాడు. బాబుతో నేను అంటూ సైకిల్ యాత్ర చేస్తున్న వారిపై పెద్దిరెడ్డి రౌడీ గ్యాంగ్ చేసిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు అధికారం ఇచ్చింది టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించడానికి, జెండాలు పీకడానికా జగన్? వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకుల చొక్కాలు విప్పి నడిరోడ్డుపై నిలబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అంటూ పోస్ట్ పెట్టారు.
పెద్దిరెడ్డి అనుచరుడి తీరుపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. జిల్లాకో నియంత పాలన సాగుతోందని ఫైరవుతున్నారు. ప్రజలు ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉంటుందని.. కానీ, ఆంధ్రాలో మాత్రం వైసీపీ పాలనలో అది కుదరదని అర్థం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమే! పాపాల పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. అహంకారం నెత్తికెక్కిన పెద్దిరెడ్డి అనుచరుడు సూరి పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద శ్రీకాకుళం నుండి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టిడిపి కార్యకర్తల చొక్కాలు విప్పించి, జెండాలు పీకి… pic.twitter.com/MKLL0bcGdb
— Lokesh Nara (@naralokesh) October 21, 2023