సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు
టీడీపీ (TDP) నేతలు కొత్త డ్రామాకు తెర లేపారు. చంద్రబాబు (Chandrababu) ఆరోగ్యం విషమించింది అంటూ ప్రాణాలకు ప్రమాదం ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం స్టెరాయిడ్స్ ఇవ్వాలని చూస్తుందంటూ లోకేష్ (Lokesh) ట్వీట్ చేశారు. ఇన్ఫెక్షన్లు, దోమలు, చర్మ సమస్యలతో ప్రాణాంతకం ఏమిటో అర్థం కావడం లేదు. నిన్నటి వరకు చంద్రబాబును 20 ఏళ్ల కుర్రాడు అంటూ కీర్తించారు.
జైలులో ఏసీలు అడగడం చిత్రంగా ఉంది. చంద్రబాబు కేజీ బరువు పెరిగారు. స్నేహా బ్లాక్ మొత్తం చంద్రబాబుకి కేటాయించాం. ఇంటి భోజనంతో అనారోగ్యానికి గురి అయ్యే ప్రమాదం ఉంది. భోజనంలో ఏమైనా కలిపి అనారోగ్యానికి గురి అయ్యేలా చేసే ఛాన్స్ ఉంది. అందుకే, ఇంటి నుంచి వస్తున్న భోజనాన్ని పరీక్షలు చేస్తున్నాం. అది జైలు అనుకుంటున్నారా? అత్తగారిల్లు అనుకుంటున్నారా? చంద్రబాబు రిమాండ్ ఖైదీ.
లాలూ ప్రసాద్, ఇంకా ఇతరులు 70 ఏళ్ళ వయసులో జైలులో ఉన్నారు. చంద్రబాబు 5 కేజీల బరువు తగ్గారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మిగిలిన ఖైదీలు మనుషులు కారా? అవసరం లేనన్ని సదుపాయాలను కల్పించాం. ఆయన తప్పు చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కనుకే కోర్టు రిమాండ్ విధించింది. ప్రత్యేకంగా చంద్రబాబు కోసం వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
అమిత్ షాను లోకేష్ కలవటంపై టీడీపీ రకరకాల డ్రామాలు వేస్తోంది. చంద్రబాబు అరెస్టు వెనుక తాను లేనని వివరణ ఇచ్చేందుకు అమిత్ షానే లోకేష్ ను పిలిచినంత హడావుడి చేస్తున్నారు. లోకేష్ ట్వీట్లు చూస్తే అమిత్ షా గోడకు తల కొట్టుకుంటారు. చంద్రబాబు ప్రతినిధిగా పురందేశ్వరి ఉన్నారు. ఆ ఫోటోలో అమిత్ షా రిలాక్స్ గా కూర్చుని ఉన్నారు. కాస్త అటెన్షన్ ఇచ్చినట్లు కూర్చుని ఉంటే టీడీపీ ప్రొజెక్షన్ మరో రకంగా ఉండేది.