Latest Breaking news in telugu, happening around the world, india and telangana, a.p.
టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu) అస్వస్థతకు గురయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజ మండ్రి జైలులో ఉన్న ఆయనకు అలర్జీ వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల రాజమండ్రిలో ఎండ వేడిమి ఎక్కువగా ఉండటం, ఉక్క పోత అధికంగా ఉండటంతో ఆయనకు అలర్జీ వచ్చినట్టు సమాచారం. దీంతో ఈ విషయాన్ని జైలు అధికారులకు చంద్రబాబు తెలియజేశారు.
చంద్రబాబు అస్వస్థతకు గురవ్వడంతో రాజమహేంద్ర వరంలోని ప్రభుత్వాస్పత్రి వైద్యులకు అధికారులు సమాచారం అందించారు. చంద్రబాబుకు వైద్యం అందించేదుకు రాజ మహేంద్రవరం వైద్యులు చేరుకున్నారు. అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితిని అధికారులు పరిశీలించారు. ఇటీవల చంద్రబాబు డీ హైడ్రేషన్ కు గురైనట్టు వార్తలు వచ్చాయి..
తనకు డీ హ్రైడేషన్ తో బాధపడుతున్నట్టు చంద్రబాబు జైలు అధికారులకు తెలిపారు. దీంతో వైద్యులు వచ్చి పరీక్షలు నిర్వహించి ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు తెలిపారు. ఇది ఇలా వుంటే చంద్రబాబు ఆరోగ్యంపై నారా భువనేశ్వరి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కక్ష పూరిత చర్యల వల్లే చంద్రబాబు జైల్లో వున్నారని ఆమె అన్నారు.
ఇక ఆయన అస్వస్థతతో ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇది ఇలా వుంటే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను టీడీపీ నేత నారా లోకేశ్ కలిశారు. చంద్రబాబు అరెస్టు, ఆయన ఆరోగ్యం గురించి అమిత్ షాకు లోకేశ్ వివరించారు. చంద్రబాబు ఆరోగ్యం పట్ల తాము ఆందోళనలో వున్నట్టు అమిత్ షాకు ఆయన తెలిపారు.









