బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది కృతిసనన్(Kriti Sanon). టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హీరోలతో కొన్ని సినిమాలు చేసిన ఈ హీరోయిన్ బాలీవుడ్(Bollywood)లో సెటిల్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఈమె ట్రేడింగ్ మాధ్యమాలను సపోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే అలాంటి వార్తలను కృతి సనన్ సీరియస్‌గా తీసుకుంది. తాజాగా కృతి తనపై వస్తున్న ఆరోపణలపై ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. ‘‘ఆ కథనాలు పూర్తిగా అవాస్తవం. ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌తో నాకు అనుబంధం ఉన్నట్లు రాశారు. నేను ఈ అంశంపై ఎప్పుడూ మాట్లాడలేదు. ఇలాంటి తప్పుడు కథనాలు, నివేదికలపై నేను చట్టపరమైన చర్యలు తీసుకున్నా.’ అంటూ పేర్కొంది.
‘తప్పుడు వార్తలను వైరల్ చేసిన వారికి లీగల్ నోటీసులు పంపించా. ఇలాంటి తప్పుడు రిపోర్టుల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా.’’ అంటూ కృతి తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న కృతి ప్రస్తుతం బాలీవుడ్లో వరుసపెట్టి సినిమాలు చేస్తోంది.
ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తోంది కృతి సనన్. అదేవిధంగా ‘దోపత్తి’ అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తోంది. ‘ఎ హీరో ఈజ్ బోర్న్’, ‘గణపథ్’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. అదేవిధంగా టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకుంది.

















ఇక కథ చూస్తే.. అర్జున్ (రణబీర్ కపూర్) ఒక బాగా ధనికులు ఇంట్లో పుడతాడు. తండ్రి బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. కానీ ఎన్ని డబ్బులు వున్నా కూడా అర్జున్ తన తండ్రి ప్రేమ ని మాత్రం పొందలేడు. అందుకనే, తండ్రి ప్రేమ కోసం ఆయనకి నచ్చిన పనులు చేయడం మొదలు పెడతాడు. అర్జున్ ఫ్రెండ్ కార్తీక్ స్నేహితురాలు గీతాంజలి. గీతాంజలి (రష్మిక మందన్న) ని అర్జున్ లవ్ చేస్తాడు. ఇదిలా ఉంటే, తండ్రి కోసం అర్జున్ చేసే పనులు వలన గీతాంజలి సఫర్ అవ్వాల్సి ఉంటుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యాపీ గా వుంటున్నప్పుడు బల్బీర్ సింగ్ పై దాడి జరుగుతుంది.
