కోలీవుడ్ అగ్ర హీరో దళపతి విజయ్(Dalapathy Vijay) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఊహాగానాలు, వార్తలకు తెర దించుతూ రాజకీయ అరంగేట్రం(Political Entry) చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
‘తమిళగ వెట్రి కళగం’(Tamilaga Vetri Kalagam) పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్లు తెలిపారు. అవినీతి నిర్మూలన కోసమే తాను పార్టీ పెడుతున్నట్లు దళపతి విజయ్ తెలిపారు. “మేం 2024 ఎన్నికల్లో పోటీ చేయం. ఏ పార్టీకి మద్దతు ఇవ్వం. జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నాం” అని విజయ్ తెలిపారు.
దీన్ని బట్టి విజయ్ 2026లో జరిగే శాసనసభ ఎన్నికలే టార్గెట్గా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ పేరు అదే అంటూ పలు మీడియా ఛానళ్లు ప్రచారం చేశాయి.
అందరూ అనుకున్నట్లుగానే విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో తమిళ రాజకీయాల్లో ఆయన ప్రభావం ఎలా ఉంటుందో మున్ముందు తెలియనుంది. విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఒకవైపు సంబరపడిపోతుండగా, మరోవైపు రాజకీయాల్లోకి వచ్చాక మరి సినిమాల్లో నటిస్తాడో లేదోనని టెన్షన్ పడుతున్నారు.
#தமிழகவெற்றிகழகம் #TVKVijay https://t.co/Szf7Kdnyvr
— Vijay (@actorvijay) February 2, 2024