Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
తెలంగాణ (Telanagana) యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎం.అజయ్‌బాబు (Ajay Babu) అధ్యక్షతన సోమాజిగూడ (Somajiguda) ప్రెస్‌క్లబ్ (Press Club) లో జరిగిన సమావేశంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ. కోదండరాం (Kodandaram), మాజీ ఎంపీ, టీపీసీసీ (TPCC) ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ పాల్గొన్నారు. యూత్ డిక్లరేషన్, మేనిఫెస్టోపై కీలక విషయాలు చర్చించారు.
ఈ సందర్భంగా మధుయాష్కీగౌడ్ (Madhuyashki Goud) మాట్లాడుతూ బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒక గూటిలో నివసించే పక్షులని, ఎంఐఎం వారికి తొత్తుగా ఉంటూ ఓట్లు చీల్చాలనే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఈ ముఠా ఒక్కటై తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవకూడదని కుట్రలు చేస్తున్నారని మధుయాష్కీ అన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్లు నిజమైన తెలంగాణ వాదులను దూరం పెట్టి, ఆస్తులను దోచుకుంటున్నారని అమలుకు నోచుకోని హామీలు ఇస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాకముందు జనం మనం అని, ఏర్పాటు అయ్యాక ధనం మనం అని, తెలంగాణ అస్తిత్వాన్ని కొల్లగొట్టిన కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్పారు. ఈనెల 14న రాష్ట్రంలోని నాలుగు ప్రధాన రహదారులపై తలపెట్టిన రాస్తారోకోను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.




