Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ గా ఉన్న గోషామహాల్ (Goshamahal) ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) .. కొన్నాళ్ళుగా సైలంట్ మోడ్ లోకి వెళ్ళిన విషయం తెలిసిందే. అత్యవసరం అనుకుంటే తప్ప పెదవి విప్పని రాజాసింగ్.. ఏది మాట్లాడిన బుల్లెట్ తూటాలా పేలుతుందనే ప్రచారం కూడా ఉంది. అయితే తాజాగా పెదవి విప్పారు రాజసింగ్.
వెంటనే మున్సిపల్ కాంట్రాక్టర్ల ( (Municipal Contractors)) బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ (GHMC) నిధులను బీఆర్ఎస్ (BRS) నేతలు సొంతానికి వాడుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని పదే పదే గొప్పగా చెప్పే కేసీఆర్, కేటీఆర్‌లు కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించటం లేదని ప్రశ్నించారు.
జీహెచ్ఎంసీలో అభివృద్ధి పనులు చేయకుండా ఎన్నికలకు వెళ్ళితే మాత్రం ప్రజలు తరమికొట్టడం ఖాయమన్నారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించకపోవటం వల్ల నగరంలో ఎక్కడికక్కడే అభివృద్ధి పనులు ఆగిపోయిన సంగతి గప్పాలు కొట్టుకునే బీఆర్ఎస్ నేతలకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి రావాలని చూస్తే మాత్రం జనం తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.





