బాలీవుడ్ నటి పరిణితి చోప్రా (Parineethi chopra)తన స్నేహితుడు, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంఎల్ఎ(MLA) అయిన రాఘవ్ చద్ద(Raghav Chadda) తో ఈ ఆదివారం ఉదయపూర్ లో వివాహం జరగనుంది. ఈ వివాహానికి బాలీవుడ్ నుండి చాలామంది ప్రముఖులు హాజరు కానున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ ఇద్దరి కుటుంబాలకి చెందిన సభ్యులు ఉదయపూర్ చేరుకున్నారు. ఉదయపూర్ లోని ‘ది లీలా ప్యాలెస్’ వీరి వివాహానికి సర్వాంగ సుందరంగా ముస్తాబు అయిందని కూడా అంటున్నారు.
ఇప్పటికే చాలామంది అతిధులు ఈ వివాహానికి రావటం మొదలెట్టారు. అలాగే పెళ్ళికొడుకు,పెళ్లికూతురు కూడా నిన్ననే చేరుకొని అక్కడ ఈ పెళ్లి ఫంక్షన్ మొదలెట్టేసారు కూడా. లేక్ పిచోలా నుండి లీలా ప్యాలెస్ హోటల్ కి బోట్ లో నిన్న వెళ్లినట్టుగా తెలిసింది. నిన్న అంత కూడా మెహందీ ఫంక్షన్ జరిగినట్టుగా తెలిసింది. ఈరోజు హల్దీ ఫంక్షన్ అలాగే సంగీత్ కూడా ఉంటుందని అంటున్నారు. అయితే పరిణీతి చోప్రా కజిన్ సిస్టర్ బాలీవుడ్, హాలీవుడ్ నటి అయిన ప్రియాంక చోప్రా మాత్రం ఇంకా రాలేదు. ఆమె లాస్ ఏంజెల్స్ లో వున్నట్టుగా తెలిసింది.
మరి ఆమె బయలుదేరి వస్తోందా లేదా అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు అని తెలిసింది. ఇక రాఘవ్ తరపున అతని పార్టీ కి చెందిన చాలామంది ప్రముఖులు ఇప్పటికే కొంతమంది ఉదయపూర్ చేరుకున్నారని మరికొంతమంది ఈరోజు రాత్రికి చేరుకుంటారని తెలిసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు గెస్ట్ లిస్ట్ లో వున్నట్టుగా తెలిసింది.
బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్, డిజైనర్ మనీష్ మల్హోత్రా కూడా ఉదయపూర్ వస్తున్నారు. మనీష్ మల్హోత్రా నే అక్కడ పరిణీతి చోప్రా కి పెళ్లి బట్టలు అన్నీ తయారు చేసాడు అని తెలిసింది. ఉదయపూర్ లో ఈ పెళ్లి వేడుకలకన్నా ముందు ఢిల్లీ లో రాఘవ్ ఇంట్లో అతని సంప్రదాయం అనుసరించి కొన్ని ప్రార్ధనలు చేసినట్టుగా తెలిసింది. దానికి అప్పుడు క్రికెటర్ హర్భజన్ సింగ్ హాజరయ్యాడు. వీరిద్దరి నిశ్చితార్ధం కొన్ని నెలల క్రితం అంటే మే నెలలో ఢిల్లీ లో అయింది. ప్రియాంక చోప్రా అప్పుడు లాస్ ఏంజెల్స్ నుండి ఆ ఫంక్షన్ కి వచ్చింది. ఆదివారం వివాహం జరగనుంది.