వన్డే క్రికెట్ (ODI Cricket) ప్రపంచకప్ (World Cup)లో టీమ్ఇండియా (Team India) వరుస విజయాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఐదు విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్.. టీమ్ఇండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీమ్ఇండియా ఆటగాళ్లలో భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫామ్ చూస్తుంటే ఈసారి కచ్చితంగా వన్డే ప్రపంచకప్ అందిస్తాడని మైఖేల్ వాన్ (Michael Vaughan) అభిప్రాయపడ్డాడు.
వన్డే క్రికెట్ లో విరాట్ జోష్ చూస్తుంటే ఫుట్ బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ గుర్తొస్తున్నాడని మైఖేల్ వాన్ అన్నారు. మెస్సీ అర్జెంటీనాకు వరల్డ్ కప్ అందించినట్టే కోహ్లీ కూడా భారత్‌కు కప్ అందిస్తాడని పేర్కొన్నాడు. ప్రపంచకప్ 2023లో కోహ్లీ.. సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న వన్డే సెంచరీ రికార్డుని బ్రేక్ చేస్తాడని వాన్ జోస్యం చెప్పాడు. మరోవైపు ఈ టోర్నీలో భారత్ అత్యంత బలమైన జట్టుగా వర్ణించాడు..
రోహిత్ సేనను ఓడించాలంటే టాప్ ఆర్డర్‌ను సాధ్యమైనంత త్వరగా అవుట్ చేయాలి. కానీ ఇప్పటివరకు ఆస్ట్రేలియా తప్ప మరే జట్టూ ఈ విషయంలో సక్సెస్ కాలేదని వాన్ అన్నారు. ఇక ఎప్పుడు టీమిండియాపై విషం చిమ్మే వాన్.. ఈసారి కాస్త భిన్నంగా స్పందించడం విశేషమని నెటిజన్స్ అనుకుంటున్నారు..
మరోవైపు న్యూజిలాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 95 పరుగులతో పవర్ ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 20 ఏళ్ల తర్వాత ఐసీసీ ఈవెంట్లో న్యూజిలాండ్‌పై భారత్‌కు తొలి విజయం లభించింది. ఇక ఈ మ్యాచ్ లో కేవలం 5 పరుగుల తేడాతో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 వన్డే సెంచరీల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టడాన్ని కోహ్లీ కోల్పోయాడని అభిమానులు నిరాశపడుతున్నారు..