తెలంగాణ(Telangana)లో ప్రభుత్వ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా పంచాయతీ రాజ్ శాఖ(Panchayat Raj Department)పరిధిలోని 395 మంది ఎంపీడీవో(MPDO)లు బదిలీఅయ్యారు. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారితో పాటు మూడేళ్లకు పైగా ఒకే చోట పని చేస్తున్న ఉద్యోగులను వారికీ మినహాయింపు ఇవ్వలేదు.
అందరినీ ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని డిసెంబరులో ఈసీ(EC) అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈసీ మార్గదర్శకాల మేరకు వివిధ శాఖలు బదిలీలు చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల బదిలీలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులను బదిలీ చేసింది.
రెవెన్యూ శాఖ 132 మంది తహసీల్లార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్లను శనివారం బదిలీ చేసింది. రెండు రోజుల్లో ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ భారీ బదిలీలు జరగనున్నట్లు సమాచారం. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 132 మంది తహసీల్దార్లను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, ఇందులో మల్టీ జోన్ 1లో 84, మల్టీ జోన్ 2లో 48 మంది తహసీల్దార్లను బదిలీచేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఇవి చేపట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 32మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు.