చాలామందికి క్రికెట్ అంటే ఇష్టం ఉంటుంది. ఏ ఒక్క మ్యాచ్ ని కూడా మిస్ అవ్వకుండా చాలా మంది చూస్తూ ఉంటారు. ప్రస్తుతం క్రికెట్ పరిస్థితిని చూసినట్లయితే ఇప్పుడు ముగ్గురు ఆల్రౌండర్లు భారత వరల్డ్ కప్పు జట్టులో ఉన్నారు. వాళ్లలో ఒకరు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఇంకొకరు రవీంద్ర జడేజా. అలానే శార్దూల్ ఠాకూర్ ప్రస్తుతం ఈ లార్డ్ శార్దూల్ గురించి నెట్టింట విపరీతంగా చర్చ జరుగుతోంది. చాలామంది జట్టులో ఎందుకు ఉన్నావని మొహమాటం లేకుండా అతనిని ప్రశ్నిస్తున్నారు. అవకాశాలు తక్కువగా వస్తుంటాయి. వాటిని కూడా ఉపయోగించుకోవట్లేదు.
భారత ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ పై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ అయితే జరుగుతోంది. ట్రోల్ర్స్ కూడా వదిలిపెట్టట్లేదు ఇప్పటిదాకా రెండు మ్యాచ్లు ఆడగా ఒక క్యాచ్ పట్టాడు. బౌలింగ్ లో ఒక వికెట్ తీశాడు. ఇది మాత్రమే అతని ప్రదర్శన. ఆఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఒక వికెట్ తీసి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అది కూడా చేయలేదు.
Also read:
భారత పేసర్లు సిరాజ్, బుమ్రా, హార్దిక్ పాండ్యా తో పాటు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఐదుగురు రెండు వికెట్లు తీస్తే ఇతను మాత్రం రెండు ఓవర్లు వేసి 11 పరుగులు ఇచ్చి వికెట్ రాబట్టడంలో ఫెయిల్ అయిపోయాడు. గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ టీం లో ఉండకూడదని అభిమానులు అన్నారు. అతని స్థానంలో అశ్విన్ కి అవకాశం ఇస్తే బాగుంటుందని అంటున్నారు. ఈ విషయాన్ని రోహిత్ కూడా చెప్పారు. సునీల్ గవాస్కర్ వంటి సీనియర్లు కూడా అదే చెప్తున్నారు. మరి మార్పు చేస్తారో లేదో చూడాలి.