రాజస్థాన్ (Rajasthan) లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దుంగార్పూర్ జిల్లాలో ట్రక్కు ఒకటి మల్టీ యుటిలిటీ వాహనాన్ని (MUV)ని ఢీ కొట్టింది. దీంతో ఎంయూవీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించి స్థానికులు అక్కడికి పరుగెత్తుకు వచ్చారు.
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రత్నాపూర్ సరిహద్దుల్లో ఢిల్లీ-ముంబై జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. జాతీయ రహదారిపై వెళ్తుండగా ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి.
ఈ క్రమంలో ట్రక్కు వేగంగా వచ్చి ఎంయూవీని ఢీ కొట్టింది.. ఎంయూవీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 8కి చేరింది.
ఘటన సమయంలో వాహనంలో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా దుంగార్పూర్ నుంచి అహ్మదాబాద్ వెళ్తున్నారు. మృతుల్లో నలుగురిని దంపాల్ (24), హేమంత్ (21), రాకేశ్ (25), ముఖేశ్ (25)లుగా గుర్తించారు. మరో రెండు మృత దేహాలను గుర్తించాల్సి ఉంది. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో దుంగార్పూర్ ఆస్పత్రికి తరలించారు.