Telugu News » TTD: టీటీడీ ఆపరేషన్ చిరుత

TTD: టీటీడీ ఆపరేషన్ చిరుత

ఇప్పటిదాకా 5 చిరుతలను బంధిస్తే ఇందులో ఒక చిరుతను కొంత కాలం ముందు తిరుపతికి దగ్గరగానే చామల రేంజ్ అటవీ ప్రాంతంలో అటవీశాఖ వదిలిపెట్టింది.

by Prasanna
leopards

గత మూడు నెలల కాలంలో తిరుమల (Tirumala) నడక మార్గంలో ఐదు చిరుతలు చిక్కాయి. నడక మార్గంలో ఏర్పాటు చేసిన బోనుల్లో చిక్కిన ఈ ఐదు చిరుతలకు (Leopards) అటవీశాఖ విముక్తి కల్పించింది. గత కొంత కాలంగా అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల్లో భయాన్ని కలిగించిన చిరుతలను బంధించేందుకు టీడీపీ ఆపరేషన్ చిరుత (Operation Chirutha) ప్రారంభించిన సంగతి తెలిసిందే.

leopards

అటవీశాఖ నడక మార్గానికి దగ్గరగా సంచరించే ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేసి చిరుతలను బంధిస్తూనే ఉంది. ఇప్పటిదాకా 5 చిరుతలను బంధిస్తే ఇందులో ఒక చిరుతను కొంత కాలం ముందు తిరుపతికి దగ్గరగానే చామల రేంజ్ అటవీ ప్రాంతంలో అటవీశాఖ వదిలిపెట్టింది. ఆ తరువాత పట్టుబడ్డ నాలుగు చిరుతల్లో రెండింటికి ఎస్వీ జూ పార్క్ లో కొంత కాలం ఉంచి, అవి మ్యాన్ ఈటర్స్ కాదని నిర్థారించుకున్న తర్వాత వాటిని అడవిలో విడిచిపెట్టారు.

ఆగస్టు 11న నడక మార్గంలో లక్షితపై దాడి చేసిన చిరుతను గుర్తించేందుకు తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ టీం ఇంకా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా సైంటిస్ట్ డాక్టర్ నందిని సేకరించిన నమూనాలు పరిశోధన తర్వాత ఈ నెల 13 న నివేదిక వచ్చింది. రిపోర్ట్ ఆధారంగా మిగిలిన రెండు  చిరుతలు కూడా మాన్ ఈటర్స్ కాదని గుర్తించడంతో అటవీశాఖ అధికారులు వాటిని విడిచి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

గత నెల 14న, 17న బంధించిన ఈ రెండు చిరుతలను తిరుపతి ఎస్వీ జూ నుంచి తరలించారు. ఏపీ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతితో ఒక చిరుతను తిరుపతికి 350 కిలోమీటర్ల దూరంలో గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యంలో అటవీశాఖ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుని వదిలి పెట్టింది.

You may also like

Leave a Comment