తమిళనాడు(Tamilanadu) మంత్రి (minister), నటుడు ఉదయనిధి స్టాలిన్ (udayanidhi stalin) మరో సారి సనాతన ధర్మ అంశం గుర్తుకొచ్చేలా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. దీంతో మరో సారి ఉదయనిధి స్టాలిన్ పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా వంటిదని వారం రోజుల కిందట ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ గుర్తుకు వచ్చేలా, దోమలను చంపేందుకు వాడే మస్కిటో కాయిల్ ఫోటోను సోషల్ మీడియాలో ఉదయ్‌నిధి పోస్ట్ చేశాడు. కానీ దానికి ఎటువంటి క్యాప్షన్ ఇవ్వలేదు. దీనిని చూసిన వారు అందరూ కూడా గతంలో సనాతన ధర్మం పై ఉదయ్ చేసిన కామెంట్లను గుర్తుకు తెస్తున్నాయి అని చర్చిస్తున్నారు.
అలాగే ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై ఉదయనిధి నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో విమర్శలు చేశారు. బీజేపీ ఒక విష సర్పం వంటిదని, బీజేపీ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జీ20 సమావేశాల సందర్భంగా దేశంలోని పేదలు, మురికి వాడలు కనిపించకుండా కేంద్ర ప్రభుత్వం దాచేసిందని విమర్శించారు.
విదేశీ నాయకుల ముందు తమ దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పుకోవడానికి నిజాన్ని దాచిపెట్టారని ఉదయనిధి అన్నారు. ఇటువంటి బీజేపీకి తమిళనాడులో చోటు కల్పించేందుకుఉన్న ఏఐడీఎంకే అనే ఒక పనికి రాని పార్టీ ప్రయత్నిస్తూ…బీజేపీ చేసే ప్రతి పనికి మద్ధతిస్తుందని అన్నారు.