Telugu News » ఘనంగా ‘అజయ్ టు యోగీ ఆదిత్య నాథ్’… పుస్తకావిష్కరణ….!

ఘనంగా ‘అజయ్ టు యోగీ ఆదిత్య నాథ్’… పుస్తకావిష్కరణ….!

ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ బ్రిటన్ ఫర్ ఉత్తర్ ప్రదేశ్' (OFBJPUK4UP) ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

by Ramu
UK book launch of Ajay to Yogi Adityanath by Shantanu Gupta

ప్రముఖ రచయిత శంతను గుప్తా (Shanthanu Guptha) రచించిన ‘అజయ్ టు యోగి ఆదిత్యనాథ్’ (Ajay to Yogi Adityanath_ మొదటి యూకే పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 19 లండన్‌లో నెహ్రూ సెంటర్ లో నిర్వహించారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ బ్రిటన్ ఫర్ ఉత్తర్ ప్రదేశ్’ (OFBJPUK4UP) ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

UK book launch of Ajay to Yogi Adityanath by Shantanu Gupta

నెహ్రూ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ రచయిత అమిష్ త్రిపాఠి, ఎంఏ టీవీ డైరెక్టర్ ఓఎఫ్ బీజేపీ యూకే 4 యూపీ అధ్యక్షుడు కులదీప్ షకావత్, ఓఎఫ్ బీజేపీ జనరల్ సెక్రటరీ సురేశ్ మంగళగిరిలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు సోషల్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ లకు చెందిన పలువురు ప్రవాస భారతీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు.

మొదట జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథులను OFBJPUK4UP సభ్యులు రాజేశ్ విశ్వకర్మ, ధీరేంద్ర కుమార్ నిమ్, హిర్దేష్ గుప్తా, జ్ఞాన్ శర్మలు ఘనంగా సత్కరించారు. వైశాలి, గీతికా సులేఖలు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అనంతరం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్బంగా పుస్తకం గురించి  శంతను గుప్తా పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. యోగీ ఆదిత్య నాథ్ తో తనకు ఉన్న సంబంధాలను ఆయన గుర్తు చేసుకున్నారు. యోగీ గురించి, ఆయన పని తీరు గురించి పలు ఆసక్తికర విషయాలను ఈ సందర్బంగా సంతను వెల్లడించారు. యూపీలో యోగీ ఎలాంటి మార్పులు తీసుకు వచ్చారనే విషయాలను కులదీప్ షకావత్, సురేశ్ మంగళగిరి వివరించారు.

అత్యంత వెనుకబడిన ప్రాంతం నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా యూపీని యోగీ ఎలా మార్చారో ఈ సందర్బంగా వివరించారు. అనంతరం ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు శంతను గుప్తా సమాధానం ఇచ్చారు.

You may also like

Leave a Comment