భారతీయుల (Indias)కు రికార్డు స్థాయి ( Record Level)లో వీసా (Visa)లను అమెరికా (USA) జారీ చేసింది. అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 23 మధ్య 1,40,000 కన్నా ఎక్కువ విద్యార్థి వీసాలను జారీ చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. లక్ష 40 వేల పైగా విద్యార్థులకు 2023 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 10 మిలియన్లకు పైగా నాన్ ఇమిగ్రెంట్ వీసాలను విడుదల చేశామని ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇటీవల వీసా అపాయింట్ మెంట్ వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. భారత్‌తో దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తమ అధ్యక్షుడు జో బైడెన్ కృషి చేస్తున్నారని తెలిపింది. అందులో భాగంగానే వీసాల జారీ విషయంలో భారతీయులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు వివరించింది.
వ్యాపారం, పర్యాటక రంగాల్లో అధికంగా ఎనిమిది మిలియన్ల మంది సందర్శకులకు వీసాలు జారీ చేశామని యూఎస్ ఎంబసీ అధికారులు తెలిపారు. గతంతో పోలిస్తే ఈ సారి ఆరు లక్షల కన్నా ఎక్కువ మందికి విద్యార్థి వీసాలను జారీ చేశామని వెల్లడించారు. 2017 ఆర్థిక సంవత్సరం తర్వాత ఈ స్థాయిలో వీసాలు జారీ చేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.
గతేడాది రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేశామన్నారు. ఈ విషయంలో చాలా గర్వపడుతున్నామని స్పష్టం చేశారు. తొలి సారిగా మిలియన్ వీసాలు జారీ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు. గతేడాది మాదిరిగానే ఇప్పుడు కూడా పరిస్థితి కొనసాగితే ఈజీగా లక్ష్యాన్ని అందుకుంటామన్నారు. భారతీయులను తాము ప్రత్యేకంగా చూస్తామన్నారు. ప్రస్తుతం అత్యధిక అమెరికా వీసాలు పొందిన దేశంగా భారత్ నిలిచిందన్నారు.
కొన్ని సార్లు విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించకుండానే వీసాలు జారీ చేశామన్నారు. అమెరికా రావాలని ఆసక్తి ఉన్న వారెవరైనా వీసాకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భారతీయ విద్యార్థులకు ఉన్న నైపుణ్యాలు అమెరికా అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయని చెప్పారు. 2023లో ఇప్పటివరకు అమెరికా 10.5 మిలియన్లకు పైగా వీసాలను జారీ చేసిందని, ఇది తమ టార్గెట్ కన్నా 2 మిలియన్లు ఎక్కువని యూఎస్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జూలీ స్టఫ్ట్ తెలిపారు.