ఉత్తరాఖండ్ (Uttarakhand) లో టన్నెల్ (Tunnnel )లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) కొనసాగుతోంది. కార్మికులను కాపాడేందుకు గత తొమ్మిది రోజులుగా అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కార్మికులను చేరుకునేందుక అమెరికా నుంచి ప్రత్యేక యంత్రాలను తీసుకు వచ్చి ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది.
ఈ క్రమంలో అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు టన్నెల్ వద్దకు చేరుకున్నారు. ఇప్పటి వరకు చేసిన రెస్క్యూ ఆపరేషన్ గురించి అధికారులను నిపుణులు అడిగి తెలుసుకున్నారు. చార్ ధామ్ మార్గంలోని సిల్క్యారా సొరంగం బార్‌కోట్ చివరలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ డ్రిల్లింగ్ చేపట్టింది.
ఈ క్రమంలో నవంబర్ 12న అందులో కొంత భాగం కూలిపోయింది. దీంతో సొరంగంలో 41 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సొరంగంలో ఓ పైపు ద్వారా కార్మికులకు ఆహారం, నీళ్లు, ఆక్సిజన్ ను అధికారులు అందిస్తున్నారు.
ఇప్పటికి తొమ్మిది రోజులు గడిచినప్పటికీ కార్మికులు రక్షించకపోవడంతో కార్మికుల కుటుంబ సభ్యులో తీవ్ర ఆందో ళన మొదలైంది. ఇది ఇలా వుంటే రెస్క్యూ ఆపరేషన్ ను ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీకి ప్రధాని మోడీ ఫోన్ చేసి రెస్క్యూ ఆపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు.