Telugu News » Vemulavada: భక్తుల రాకతో…ట్రాఫిక్ లో చిక్కుకున్న పట్టణం

Vemulavada: భక్తుల రాకతో…ట్రాఫిక్ లో చిక్కుకున్న పట్టణం

చివరి సోమవారం కావడంతో భక్తుల తాకిడి విపరీతంగా కనిపించింది. దీంతో గుడికి వాహనాలపై వచ్చిన వారికి పార్కింగ్ ఇబ్బందులు ఏర్పడ్డాయి.

by Prasanna
traffic

రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sirisilla) వేములవాడ (Vemulavada)కు భక్తులు పొటెత్తారు. శ్రావణమాసం చివరి సోమవారం ప్రభావంతో భక్తులు (Pilgrims) పెద్ద ఎత్తున్న వేములవాడ చేరుకున్నారు.

traffic

చివరి సోమవారం కావడంతో భక్తుల తాకిడి విపరీతంగా కనిపించింది. దీంతో గుడికి వాహనాలపై వచ్చిన వారికి పార్కింగ్ ఇబ్బందులు ఏర్పడ్డాయి.  ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వేములవాడలోని ఏ మార్గంలోనైనా వాహనాల రాకపోకలకు అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయ్యింది.

వేమలవాడ పట్టణంలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే వైపు అన్ని మార్గాలు కూడా వాహనాలతో నిండిపోయాయి. అంతే కాకుండా మూలవాగు వంతెనపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి.

గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్ లోనే ఇరుక్కుపోయారు. ఎటు కదలలేని స్థితిలో ఉండిపోయారు. మరో వైపు పోలీసులు ఈ ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా కూడా చాలా సమయం పట్టేటట్లే ఉంది. ఎందుకంటే అసలు వాహనాలు ఎటు కదలలేని పరిస్థితులు వేములవాడ చుట్టుపక్కల నెలకున్నాయి.

You may also like

Leave a Comment