మహిళా రిజర్వేషన్ బిల్లు (Woman Reservation Bill) పై బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి (Uma Bharathi) అసంతృప్తి (Disappointment) వ్యక్తం చేశారు. ఈ బిల్లులో ఓబీసీ (OBC) మహిళల కు కోటా ప్రకటించక పోవడంపై తాను అసంతృప్తిగా వున్నానని వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని మోడీకి (PM MOdi) ఆమె లేఖ (Letter ) రాశారు.
మహిళలకు కేటాయించే కోటాలో 50 శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లిం మహిళలకు కేటాయించాలని లేఖలో కోరారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టడం సంతోషాన్ని కలిగించిందన్నారు. కానీ ఇందులో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళ కోటా ప్రస్తావన లేకపోవడం అసంతృప్తిని కలిగించిందన్నారు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించకపోతే, బీజేపీపై వారి విశ్వాసం దెబ్బతింటుందన్నారు.
గతంలో హెచ్ డీ దేవె గౌడ ప్రధానిగా వున్న సమయంలో ఇదే విధమైన బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టారని చెప్పారు. అప్పుడు ఆ బిల్లును వ్యతిరేకించి, తాను పలు మార్పులు చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ విషయంలో ప్రధాని మోడీ చర్యలు తీసుకుంటారని తాను అనుకుంటున్నట్టు చెప్పారు. ప్రధాని మోడీకి ఈ రోజు ఉదయం లేఖ రాసి బిల్లు ప్రవేశ పెట్టే వరకు మౌనంగా వున్నానన్నారు.
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించ ప్రత్యేక నిబంధన అని అన్నారు. ఈ 33 శాతంలో 50 శాతం ఎస్సీ; ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన మహిళలకు రిజర్వ్ చేసేలా చూడాడలని ప్రధానిని ఆమె కోరారు. పంచాయతీ రాజ్, స్థానిక సంస్థల్లో వెనుబడిన తరగతుల మహిళకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని ఆమె తెలిపారు.