నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) మార్ఫింగ్ వీడియోపై ఇప్పుడు రచ్చ జరుగుతోంది. ‘డీప్ ఫేక్ వీడియో’ (Deep Fake Video) టెక్నాలజీ ఉపయోగించి రూపొందించిన ఈ వీడియోపై ఇప్పుడు దేశ వ్యాప్త చర్చ జరుగుతోంది. ఈ వీడియోపై ఇప్పటికే పలువురు టెక్ నిపుణులు, సినీరంగ, రాజకీయ ప్రముఖుల ఆ వీడియోపై ఇప్పటికే స్పందించారు. నిందుతులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
తాజాగా ఈ వీడియోపై రౌడీ స్టార్ విజయ్ దేవర కొండ (Vijay Devarakonda) స్పందించారు. మరే మహిళకు ఇలాంటి అనుభవం ఎదురు కాకూడదన విజయ్ అన్నారు. ఇలాంటి ఘటనపై తక్షణమే చర్యలు తీసుకునేలా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మార్ఫింగ్ వీడియో చేసిన వారిని గుర్తించి వారికి శిక్షలు పడేలా చూడాలన్నారు.
భవిష్యత్తు కోసం ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాలని చెప్పారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయంపై స్పందించారు. రష్మిక మందన్నాకు ఎదురైన చేదు అనుభవం గురించి సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిందని తెలిపారు. సెలబ్రిటీలను ఇలా కించపరచడం అంత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెక్నాలజీని వాడుకుని ఇలా మహిళలను వేధించడం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాంటి చట్టాలు వస్తే వాటిని అమలు చేసే విషయంలో తెలంగాణ రాష్ట్రం ముందు ఉంటుందన్నారు. ఇలాంటివి జరగకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. రష్మికకు తమ మద్దతు ఉంటుందన్నారు.