Telugu News » ICICI Bank: తిన్నంటి వాసాలు లెక్కపెట్టిన డిప్యూటీ మేనేజర్‌!

ICICI Bank: తిన్నంటి వాసాలు లెక్కపెట్టిన డిప్యూటీ మేనేజర్‌!

ఇలా తీసిన రూ.8.65 కోట్లను ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టాడు.

by Sai
warangal icici bank deputy manager chartered bank with gold loan fake accounts

పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేసి రూ.8.65 కోట్లు స్వాహా చేసిన డిప్యూటీ మేనేజర్‌ (Deputy Manager)ను మంగళవారం పోలీసులు (police) అరెస్ట్‌(Arrest) చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ ఎస్‌ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా కరీమాబాద్‌కు చెందిన బైరిశెట్టి కార్తీక్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌(Icici) నర్సంపేట బ్రాంచ్‌లోని గోల్డ్‌లోన్‌ సెక్షన్‌లో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేసేవాడు.

warangal icici bank deputy manager chartered bank with gold loan fake accounts

గోల్డ్‌లోన్‌ రెన్యూవల్‌, ఖాతాల ముగింపును చూసేవాడు. బంగారు రుణ ఖాతా నిమిత్తం ఖాతాదారులు డబ్బులు తీసుకొస్తే కార్తీక్‌ ఆ డబ్బులను తీసుకుని వారి ఖాతాల్లో జమ చేయకుండా వాడుకునేవాడు.

రుణ ఖాతా క్లోజ్‌ చేయకుండానే బంగారు ఆభరణాలు ఖాతాదారులకు ఇచ్చేవాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ మొత్తాన్ని ఇతనే చెల్లించి ఖాతా నడుస్తున్నట్టుగా బ్యాంకు రికార్డుల్లో చూపి ఆ డబ్బులను కార్తీక్‌ సొంతానికి వాడుకునేవాడు.

ఇలా తీసిన రూ.8.65 కోట్లను ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టాడు. ఈ తతం గం గతనెల 11న వెలుగు చూసింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు నర్సంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం కార్తీక్‌ను రిమాండ్‌కు తరలించినట్టు ఆయన పేర్కొన్నారు.

You may also like

Leave a Comment