Telugu News » HISTORY : అధికారమే పరమావధి.. బ్రిటీష్ వారి ఆదేశాలను ధిక్కరించిన షహీద్ ప్రిన్స్ కున్వర్ చైన్ సింగ్!

HISTORY : అధికారమే పరమావధి.. బ్రిటీష్ వారి ఆదేశాలను ధిక్కరించిన షహీద్ ప్రిన్స్ కున్వర్ చైన్ సింగ్!

మూడవ ఆంగ్లో- మరాఠా యుద్ధం తర్వాత మధ్య భారతదేశంలోని అన్ని పూర్వ మరాఠా భూభాగాలను బ్రిటీష్ వారు తమ అధీనంలోకి తీసుకున్నారు. పూర్వం మరాఠా సామ్రాజ్యం మొత్తం ఛత్రపతి శివాజీ సంస్థానంలో భాగంగా ఉండేది.

by Sai
We have suppressed terrorism.. we have built the Ram Temple.. Now you are waiting for Kishan Reddy!

మూడవ ఆంగ్లో- మరాఠా యుద్ధం తర్వాత మధ్య భారతదేశంలోని అన్ని పూర్వ మరాఠా భూభాగాలను బ్రిటీష్ వారు తమ అధీనంలోకి తీసుకున్నారు. పూర్వం మరాఠా సామ్రాజ్యం మొత్తం ఛత్రపతి శివాజీ సంస్థానంలో భాగంగా ఉండేది. ఎంతో మంది మొఘలులు, సుల్తానులతో యుద్ధం చేసి శివాజీ మహారాజ్ అనంతమైన హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ వీరుడి మరణాంతరం బ్రిటీష్ వారు ఇండియాలోకి ప్రవేశించడం, మరాఠా భూభాగాలపై కన్నేయడం, మరాఠా యోధులతో యుద్దం ఇలా జరుగుతూ వచ్చింది.

We have suppressed terrorism.. we have built the Ram Temple.. Now you are waiting for Kishan Reddy!

కాలక్రమేణా మరాఠా సామ్రాజ్యంలోని భూభాగాలు మొత్తం బ్రిటీష్ వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. అయితే, షహీద్ ప్రిన్స్ కున్వర్ చైన్ సింగ్ (Shaheed prince kunwar chain singh) (1800-1824) ప్రస్తుత మధ్యప్రదేశ్‌(MadyaPradesh)లోని రాజ్‌గఢ్ జిల్లా నర్సింగ్‌గఢ్‌కు చెందిన యువరాజు.మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధం పూర్తయ్యాక మధ్య భారతంలోని అన్ని పూర్వ మరాఠా భూభాగాలను బ్రిటిష్ వారు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అందులో నర్సింగ్ గఢ్ కూడా ఒకటి.

అయితే, తన సామ్రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చైన్ సింగ్ ఎన్నో ప్రయత్నాలు చేయసాగాడు. అప్పటికే రాజకీయ అధికారం కోసం బ్రిటీష్ వారు ప్రయత్నించగా..అందుకు చైన్ సింగ్ నిరాకరించాడు.భూభాగం వారి చేతుల్లోకి వెళ్లిన రాజ్యాధికారం ఇచ్చేందుకు చైన్ సింగ్ ససేమీరా అన్నాడు.అంతటితో ఆగకుండా బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నాడు.

తన మంత్రివర్గంలోని కొందరు బ్రిటీష్ వారికి గుట్టుగా సమాచారం చేరవేస్తున్నారని గుర్తించి వారిని అంతమొందించాడు. ఆ విషయం తెలిసి బ్రిటీష్ వారు చైన్ సింగ్‌ను ఎదుర్కోవడానికి సెహోర్ కంటోన్మెంట్‌లో ఉన్న వారి రాజకీయ ఏజెంట్ మాడాక్‌ను ఆదేశించింది.

We have suppressed terrorism.. we have built the Ram Temple.. Now you are waiting for Kishan Reddy!

అయితే, మాడాక్ ఆదేశాలను పలుమార్లు చైన్ సింగ్ ధిక్కరించాడు. అధికారమే పరమావధిగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. అధికారం లేని నాడు జీవించి ఉన్నా లేకున్నా ఒకటే అనే భావనకు వచ్చిన చైన్ సింగ్.. చివరకు 24 జూన్ 1824న తన నమ్మకమైన సైనికులు 50 మందితో కలిసి బ్రిటీష్ మాడాక్ అధికారును కలవడానికి వెళ్లాడు. అక్కడ వారు పెట్టిన షరతులను చైన్ సింగ్ ఖరాఖండీగా తిరస్కరించాడు.

అది కాస్త బ్రిటీష్ సైన్యంతో సాయుధ ఘర్షణకు దారి తీసింది. బ్రిటీష్ వారి ఆయుధ సంపత్తి ముందు చైన్ సింగ్,తన సహచరులతో కలిసి వీరమరణం పొందాడు.
1857 సిపాయిల తిరుగుబాటు(మొదటి స్వాతంత్ర్య సంగ్రామం)కు ముందు ప్రిన్స్ కున్వర్ చైన్ సింగ్ బ్రిటీష్ ఆదేశాలను ధిక్కరించడంతో పాటు వారికి ఎదురు తిరిగాడు. తనకు దక్కాల్సిన అధికారం కోసం అమరుడయ్యాడే తప్పా.. వారి కింద బానిసత్వానికి చేయడానికి నో చెప్పాడు. మాతృభూమి కోసం తెల్లదొరలతో ఫైట్ చేసి సెహోర్‌లోని ఓ సమాధిని అలంకరించాడు.

You may also like

Leave a Comment