365
వెదర్ కి వెటకారం పెరిగింది. నిన్న మొన్నటి వరకూ వర్షాల(Heavy rains )తో తెలుగు రాష్ట్రాలను ఊపిరాడకుండా చేసిన వాతావరణం ఇప్పుడు ఉక్కపోత(steel casting)గా మారబోతోందట. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణం వేడెక్కనుందట.
ఆగస్టు 20 వరకు రాష్ట్రంలో ఉక్కపోత ఉండనుంది. ఇప్పట్లో దట్టమైన మేఘాలు వచ్చే అవకాశాలు కనిపించట్లేదు.నిజానికి ఆగస్టు నెలలో వర్షాలు ఊపందుకోవాలి.. కానీ విచిత్రంగా ఎండలు, ఉక్కపోత పెట్టనుంది.
పొడి మేఘాలు కమ్ముకోవడంతో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రుతుపవనాల కదలికలు తెలంగాణ(Telngana)లో బలహీనంగా ఉన్నాయి.గత వారం కురిసిన వర్షాల వల్ల కూడా వేడి పెరుగుతోంది.
భూగర్భ జలాల నుంచి వేడి, తేమ, వాతావరణంలో కలుస్తున్నాయి. అందువల్ల ప్రజలకు ఉక్కపోత ఫీల్ కలుగుతోంది. ఉదయం పది గంటలు దాటితే విపరీతమైన వేడి ఉంటుంది.