Telugu News » WORLD CUP 2023 : షెడ్యూల్ ఛేంజ్…భారత్- పాక్ పోరు ఎప్పుడంటే..!?

WORLD CUP 2023 : షెడ్యూల్ ఛేంజ్…భారత్- పాక్ పోరు ఎప్పుడంటే..!?

క్రికెట్ వరల్డ్ కప్ టైమ్ స్టార్ట్ అయ్యింది. అప్ డేట్స్ కోసం క్రికెట్ అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

by sai krishna

క్రికెట్ వరల్డ్ కప్ టైమ్ స్టార్ట్ అయ్యింది. అప్ డేట్స్ కోసం క్రికెట్ అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇంటర్ నేషనల్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(ICC) తీసుకునే ఏ నిర్ణయం అయినా ఆటగాళ్లకు కీలకంగా మారనుంది.

అయితే ఈ  క్రమంలో  ఐసీసీ తాను ముందుగా ప్రకటించిన షెడ్యూల్ లో కొన్ని మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది.తొమ్మిది మ్యాచ్ లను రీషెడ్యూల్ చేస్తున్నట్టు తెలిపింది.దీంట్లో భాగంగా అహ్మదాబాద్లో 15వ తేదీన జరగాల్సిన భారత్ -పాకిస్థాన్ మ్యాచ్(IND VS PAK match)..ఒకరోజు(అక్టోబరు 14వ తేదీ) ముందే జరగనుందని పేర్కొంది.

*అక్టోబర్ 14న దిల్లీ( Delhi) వేదికగా జరగాల్సిన ఇంగ్లాండ్-అప్ఘానిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 15న నిర్వహించబోతున్నట్లు తెలిపింది.

*అక్టోబర్ 12న హైదరాబాద్( Hyderabad) వేదికగా శ్రీలంక-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అక్టోబర్ 10న నిర్వహించనున్నారు.

*అక్టోబర్ 13 శుక్రవారం లఖ్నవూ( Lakhanpur) వేదికగా నిర్వహించాల్సిన ఆస్ట్రైలియా-సౌతాఫ్రికా మ్యాచ్ను అక్టోబర్ 12న జరగనుంది.

*అక్టోబర్14న చెన్నై(Chennai) వేదికగా జరగాల్సిన న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్..అక్టోబర్ 13న డే అండ్ నైట్ కంటెస్ట్గా నిర్వహించనున్నారు.

*ధర్మశాల(Dharmasala ) వేదికగా నవంబర్‌ 11న ఇంగ్లాండ్-బంగ్లాదేశ్‌ మధ్య జరగాల్సిన డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌.. అదే రోజు నవంబర్‌ 11 డే మ్యాచ్‌ (10:30)గా నిర్వహించనున్నారు.

*పుణె( Pune) వేదికగా నవంబర్ 12న జరగాల్సిన ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య నవంబర్‌ 11న ఉదయం 10.30 గంటలకు జరగనుంది.

*కోల్‌కతా( Kolkata) వేదికగా నవంబర్‌ 12న జరగాల్సిన ఇంగ్లాండ్-పాకిస్థాన్ మ్యాచ్ నవంబర్‌11న మధ్యాహ్నం 2.30 గంటలకు జరగనుంది.

*బెంగళూరు(Bengaluru) వేదికగా టీమ్ఇండియా లాస్ట్ లీగ్ గేమ్.. నవంబర్‌ 11 నుంచి నవంబర్‌ 12వ తేదీకి మారింది. ఇందులో భారత్..నెదర్లాండ్స్తో తలపడనుంది.

భారత్‌ వేదికగా ఈ వన్డే వరల్డ్‌ కప్‌ జరగనుంది.ఈ మెగా సమరం అక్టోబర్‌ 5న ప్రారంభమై నవంబర్‌ 19న ముగియనుంది. ఈ టోర్నీ ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లు.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక జరగనున్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లాండ్..రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య జరగనుంది.

You may also like

Leave a Comment