Telugu News » BHONGIR : భార్య చేసిన ఆ ఒక్క పనితో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన భర్త.. ఏం జరిగిందంటే?

BHONGIR : భార్య చేసిన ఆ ఒక్క పనితో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన భర్త.. ఏం జరిగిందంటే?

కట్టుకున్న భార్య (WIFE) చేసిన ఆ ఒక్క పని వారి పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. ఎందుకు ఇలా చేశావ్ అని ప్రశ్నించిన భర్త(HUSBAND)కు బెదిరింపులు మొదలయ్యాయి. గట్టిగా వాదిస్తే ఆత్మహత్య(SUICIDE) చేసుకుని చనిపోతానని ఆ భార్య బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టింది. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆ భర్త డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఈ ఘటన రాష్ట్రంలోని భువనగిరి జిల్లాలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది.

by Sai
What happened to the husband who went into depression because of that one thing his wife did

ఇంతకు ఆ వివాహిత చేసిన పని ఏమిటంటే.. సొంతిల్లు కట్టుకునేందుకు భర్త కష్టపడి సంపాదించిన రూ.16లక్షలను భార్య ఆన్‌లైన్ గేమ్స్ ఆడి పొగొట్టింది. డబ్బులు ఏమయ్యాయని భర్త ప్రశ్నించగా ఆమె నుంచి ఎటువంటి సమాధానం లేదు. గట్టిగా ప్రశ్నించగా అసలు వియషాన్ని వెల్లడించింది. దీంతో భర్త ఆమెతో వాగ్వాదం పెట్టుకోగా తనను ఎవరైనా ఏమైనా అంటే ఇంట్లో అందరి పేర్లు రాసి చనిపోతానని బెదిరింపులకు దిగింది.

భార్య చేసిన పనికి ఏం చేయాలో తెలియక భర్త డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు సమాచారం. అంతకుముందు వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇలాంటి ఆన్ లైన్ గేమ్స‌్‌కు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడి అప్పుల పాలైన చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఏదో ఒక మూలనా ఎవరో ఒకరు డబ్బులు పోగొట్టుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. అయితే,కొన్ని ఘటనలు వెలుగుచూస్తుండగా, మరొకొన్ని వెలుగులోకి రావడం లేదు. అందుకే వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

You may also like

Leave a Comment