జనాభా నియంత్రణ (birth control) వ్యాఖ్యలపై దుమారం రేగడంతో బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) స్పందించారు. తన వ్యాఖ్యలకు అసెంబ్లీ సాక్షిగా క్షమాపణలు చెబుతున్నట్టు వెల్లడించారు. తన వ్యాఖ్యలతో జనంలోకి తప్పుడు సందేశం వెళ్లివుంటే వాటిని వెంటనే వెనక్కి తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.
అసెంబ్లీలో నిన్న సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ…. భర్తల చర్యల వల్ల జననాల సంఖ్య బాగా పెరిగిపోతోందన్నారు. కానీ భర్తను ఎలా నియంత్రించాలో చదువుకున్న మహిళలకు తెలుసన్నారు. చదువుకున్న మహిళలు తమ భర్తలను శృంగారంలో నియంత్రించగలరని పేర్కొన్నారు.
అందుకే ఇప్పుడు జననాల రేటు తగ్గుతోందన్నారు. సీఎం వ్యాఖ్యలపై దుమారం రేగింది. సీఎం వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నితీశ్ తన వ్యాఖ్యలతో ప్రజాస్వామ్య హుందాతనాన్ని తగ్గించారంటూ బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో ఇలాంటి వ్యాఖలు సరికాదన్నారు.
సీఎం క్షమాపణలతో వివాదం సమసి పోతుందని అంతా అనుకున్నారు. కానీ జేడీయూ నేత లలన్ సింగ్ మరోసారి వివాదాన్ని రేకెత్తించారు. సీఎం వ్యాఖ్యల్లో తప్పేముందని లలన్ సింగ్ ప్రశ్నించారు. అందులో అంత అభ్యంతరకరమైనది ఏముందని ఆయన ప్రతిపక్షాలను నిలదీశారు. దీంతో మరోసారి దుమారం రేగుతోంది.