Telugu News » Warangal : చర్చకు సిద్ధమా! అంటూ ఎర్రబెల్లిపై వాట్సప్ పోస్టు, కేసు నమోదు

Warangal : చర్చకు సిద్ధమా! అంటూ ఎర్రబెల్లిపై వాట్సప్ పోస్టు, కేసు నమోదు

శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వాట్సప్ గ్రూపులో పోస్టులు పెట్టరని తమకు ఫిర్యాదు అందిందని, వాటిని పరిశీలించన తర్వాత రమేష్ రాజా అనే వ్యక్తితో పాటు మరి కొందరిపై కేసులు నమోదు చేసినట్లు పాలకుర్తి పోలీసులు తెలిపారు.

by Prasanna
Yerrabelli

‘మన పాలకుర్తి’ అనే వాట్సాప్ గ్రూప్ (Whastapp Group) లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Yerrabelli Dhayakarrao) కు వ్యతిరేకంగా కొందరు యువకులు పోస్టులు పెట్టారు. వీరిపై పోలీసులు కేసు నమోదు (Case filed) చేశారు. మంత్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గోపి అనే యువకుడు ఫిర్యాదు చేయడంతో ఈ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Yerrabelli

శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వాట్సప్ గ్రూపులో పోస్టులు పెట్టరని తమకు ఫిర్యాదు అందిందని, వాటిని పరిశీలించన తర్వాత రమేష్ రాజా అనే వ్యక్తితో పాటు మరి కొందరిపై కేసులు నమోదు చేసినట్లు పాలకుర్తి పోలీసులు తెలిపారు. ఐపీసీ 504, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాట్సాప్ గ్రూప్ సభ్యుల కామెంట్స్ పై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పాలకుర్తి పోలీసులు చెప్పారు. ప్రజా ప్రతినిధులను ప్రశ్నించే హక్కు లేదా అంటూ పాలకుర్తి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఈ నెల 21న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి మండల కేంద్రంలోని అంగడిలో రేకుల షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీకి చెందిన లీడర్ మామిండ్ల రమేశ్ రాజా…’దొరా ఇంత కాలం ఏం చేశారు. ఇన్ని రోజులకు అంగడి గుర్తుకు వచ్చిందా? ప్రస్తుతం పాలకుర్తి ఏం అభివృద్ధి చెందింది. చర్చకు సిద్ధమా?’ అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును నిలదీస్తూ వాట్సాప్ లోకల్ గ్రూపుల్లో పోస్టు పెట్టాడు.

అలాగే మండలంలోని బొమ్మెర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జ్ కొండా శ్రీను కూడా రెండు రోజుల క్రితం మంత్రిని విమర్శిస్తూ రెండు పోస్టులను పెట్టాడు. ఓ పేపర్ లో ఎర్రబెల్లిపై వచ్చిన కథనాన్ని షేర్ చేయడంతో పాటు ‘మంత్రి ఇలాకాలో కబ్జా నిజమేనా? తొర్రూరు చుట్టూ ఉన్న 250 ఎకరాల భూమి గురించి మాట్లాడాలంటే భయపడుతున్న జనం. రియల్ దందానా? లేక అబద్దపు ప్రచారమా? అంటూ మరో పోస్టు పెట్టాడు.

దీంతో మంత్రి ఎర్రబెల్లిపై అభ్యంతరకరంగా పోస్టులు చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ కార్యకర్త గోపి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఇద్దరికీ నోటీసులు ఇచ్చామని పోలీసులు చెప్పారు.

You may also like

Leave a Comment