Telugu News » CM KCR : కేసీఆర్ ఎక్కడ..?

CM KCR : కేసీఆర్ ఎక్కడ..?

కేసీఆర్ కు ఏమైంది? కేటీఆర్ చెప్పిన వైరల్ ఫీవర్ ఇంకా తగ్గలేదా? లేక, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇలా అనేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు మా సీఎం ఎక్కడ? అంటూ నిలదీస్తున్నారు.

by admin
cm kcr

– సీఎంకు ఇంకా జ్వరం తగ్గలేదా?
– హరీష్ రావు చేతులమీదుగానే..
– బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభం
– ముందు కేసీఆర్ ప్రారంభిస్తారని ప్రచారం
– చివరి నిమిషంలో పర్యటన రద్దు
– సీఎం బయటకు రాకపోవడంపై బీజేపీ అనుమానాలు
– మా సీఎం ఎక్కడ? అంటూ సెటైర్స్

కేంద్రంలోని బీజేపీ (BJP) సర్కార్ పై కేసీఆర్ (KCR) యుద్ధం ప్రకటించినప్పటి నుంచి ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా.. రాష్ట్ర మీడియాతోపాటు జాతీయ ఛానళ్లు హైలైట్ చేస్తున్నాయి. ఢిల్లీ (Dilhi) నుంచి రాష్ట్రానికి వచ్చే జాతీయ నేతలు తెలంగాణ (Telangana) సర్కార్ పై విమర్శలు చేసి వెళ్లడం.. తర్వాత ప్రెస్ మీట్ పెట్టో.. ఏదైనా సభలోనో ప్రస్తావిస్తూ కేసీఆర్ కౌంటర్ ఇవ్వడం జరుగుతూ వస్తోంది. కానీ, సడెన్ గా ఇదంతా మారిపోయింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈమధ్య రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోడీ (PM Modi).. డైరెక్ట్ గా కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కేటీఆర్ (KTR) ను సీఎం చేయాలనే అంశంపై ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను రివీల్ చేశారు. మూడు రోజుల్లో రెండు సార్లు రాష్ట్రానికి వచ్చిన బీఆర్ఎస్ (BRS) అవినీతిని, ప్రభుత్వ అసమర్ధతను కడిగిపారేశారు. మోడీ డైరెక్ట్ ఎటాక్ సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదే టైమ్ లో కేసీఆర్ మౌనం కూడా హాట్ టాపిక్ గా మారింది.

cm kcr

మోడీ వ్యాఖ్యలకు కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు గానీ, కేసీఆర్ మౌనంగా ఉండిపోయారు. మొన్నటిదాకా చిన్న కామెంట్ చేసినా తనదైన స్టయిల్ లో ఎటాక్ చేసే సీఎం.. ఇప్పుడు సైలెంట్ గా ఉండిపోవడం కొత్త చర్చకు దారితీసింది. అసలు, కేసీఆర్ కు ఏమైంది? కేటీఆర్ చెప్పిన వైరల్ ఫీవర్ ఇంకా తగ్గలేదా? లేక, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇలా అనేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు మా సీఎం ఎక్కడ? అంటూ నిలదీస్తున్నారు. ఆయన హెల్త్ బులిటెన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కొన్నాళ్ల క్రితం సీఎంకు వైరల్ ఫీవర్ వచ్చిందని, ఐదుగురు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత నుంచి ఏ సమాచారం బయటకు రాలేదు. పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ కార్యక్రమాలను కేటీఆర్ చూసుకుంటున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అన్నీ ఆయన చేతులమీదుగానే జరుగుతున్నాయి. హరీష్ రావు, కవిత కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని కూడా హరీష్ రావు ప్రారంభించారు. ముందు కేసీఆర్ స్టార్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, చివరి నిమిషంలో హరీష్ చేతులమీదుగా ఇది ప్రారంభం అయింది.

సాధారణంగా జ్వరం అంటే మూడు, నాలుగు రోజులు.. లేదంటే వారం.. కానీ, రోజులు గడుస్తున్నా కేసీఆర్ బయటకు రాకపోవడంపై బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ పదే పదే స్పందిస్తున్నారు. ‘‘మా ముఖ్యమంత్రి కనిపించడం లేదు. కేటీఆర్ పైనే అనుమానంగా ఉంది’’ అని సెటర్లు వేస్తున్నారు. సీఎంకు ఏమైంది? కేటీఆర్ ఏమైనా చేశారా? లేక ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? అంటూ డౌట్స్ రెయిజ్ చేస్తున్నారు. ‘‘కేసీఆర్ మా సీఎం. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. వెంటనే, ఆయనతో మీడియా సమావేశం పెట్టించాలి. అప్పుడే క్షేమంగా ఉన్నారని మేం నమ్ముతాం’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు సంజయ్. తాజాగా సీఎం ప్రారంభించాల్సిన బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కూడా ఆయన ప్రారంభించకపోవడంతో ఈ అంశంపై మరింత ఘాటుగా రియాక్ట్ అవుతోంది బీజేపీ.

You may also like

Leave a Comment