తెలంగాణలో ఎన్నికల హడావిడి పూర్తయిపోయింది. ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది ఈసారి తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో చాలా ట్విస్టులు కూడా చోటుచేసుకున్నాయి. అలా జరిగిన వాటిలో ఒక ట్విస్ట్ ని చూద్దాం. ఒకచోట 37 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటున్న ఎర్రబెల్లి దయాకర్ రావుకి 26 ఏళ్ల అమ్మాయి షాక్ ని ఇచ్చింది. 37 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటున్నాయని ఓడించింది యశస్విని రెడ్డి.
ఆ మంత్రికి ఉన్న రాజకీయ అనుభవం అంత వయసు కూడా ఆమెకి లేదు కానీ ఆమె ఎన్నికల్లో గెలిచింది. 37 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆ వ్యక్తిని ఓడించింది 1985 నుండి కూడా పోటీ చేస్తున్నాడు అతను. నిజానికి ఈ సీటు ఆమె అత్త ఝాన్సీరాణికి రావాలి. ఆమె ఒక ఎన్నారై. భారత పౌరసత్వం లేకపోవడంతో పోటీ చేయడానికి కుదరలేదు. ఆమె పెట్టుకున్న పౌరసత్వ అప్లికేషన్ పై ఇప్పటివరకు స్పందన రాకపోవడంతో ఆమె స్థానం లో యశస్విని ని పెట్టారు.
Also read:
ఎర్రబెల్లి తో గెలవడం అనేది చిన్న విషయం కాదు యశస్విని రెడ్డి పార్టీ టికెట్ వచ్చినప్పుడు నుండి ప్రజల్లో తిరుగుతూ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి అక్కడ ప్రజలు చెప్పారు. గట్టిగానే ఆమె ప్రచారం చేశారు ఫలితంగా విజయాన్ని అందుకున్నారు. ప్రజలు దీవిస్తేనే బలమైన నాయకులు అవుతారని ఆమె చెప్పారు. ఆమె ఇంట్లో సందడి వాతావరణం మొదలైంది. అభిమానులు కూడా ఆమె ఇంటికి వచ్చి శుభాకాంక్షలు చెప్పారు.