Telugu News » Cyclone : తుపాన్లకు పేర్లు పెట్టేది ఎవరు…!

Cyclone : తుపాన్లకు పేర్లు పెట్టేది ఎవరు…!

ప్రతి ఏడాది మనం ఏదో ఒక తుపాన్ పేరు వింటూనే ఉన్నాం. ఆ తుపాన్లు సృష్టించే విధ్వంసాన్ని కళ్లారా చూస్తూనే ఉన్నాయి.

by Ramu
Who named Cyclone Michaung Know list of cyclones in India

మిచాంగ్ తుపాన్ (Cyclone Michaung) విధ్వంసం (Devastation) సృష్టిస్తోంది. మిచాంగ్ ప్రభావం వల్ల ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రతి ఏడాది మనం ఏదో ఒక తుపాన్ పేరు వింటూనే ఉన్నాం. ఆ తుపాన్లు సృష్టించే విధ్వంసాన్ని కళ్లారా చూస్తూనే ఉన్నాయి. తుపాన్లకు ఎవరు పేర్లు పెడతారు, ఇలా పేర్లు పెట్టడం వెనుక ఏదైనా కారణం ఉందా అనే విషయం మనలో చాలా మందికి తెలియదు.

ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా పదుల సంఖ్యలో తుపాన్లు వస్తున్నాయి. వాటి వాల్ల పలు దేశాలల్లో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ క్రమంలో ఏ తుపాన్ సమయంలో ఎంత నష్టం వాటిల్లుతోంది, దాని ప్రభావం ఎంత వరకు ఉందనే విషయాన్ని గుర్తించడం ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో తుపాన్లకు పేర్లు పెడితే బాగుంటుందని, అప్పుడు ఏ తుపాన్ తీవ్ర ఎంత ఉందని గుర్తించడం సులువుగా ఉంటుందని అమెరికా ప్రతిపాదించింది.

ఈ క్రమంలో 2000 సంవత్సరంలో యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్ కమిషన్‌ ఫర్‌ ఏసియా అండ్‌ పసిఫిక్‌, ఇంకా వరల్డ్‌ మెట్రలాజికల్‌ ఆర్గనైజేషన్‌ తుపాన్లకు పేర్లు పెట్టే సాంప్రదాయాన్ని ప్రవేశ పెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఆరు వాతావరణ కేంద్రాలు, వాటితోపాటు ఐదు ప్రాంతీయ ఉష్ణమండల తుఫాను హెచ్చరికల కేంద్రాలు ఈ పేర్లను పెడుతున్నాయి.

బిప్రజాయ్ : ఈ ఏడాది జూన్ 6న బిపర్ జాయ్ తుపాన్ వచ్చింది. తూర్పు-మధ్య అరేబియా మహాసముద్రంలో ఈ తుపాన్ ఉద్బవించింది. ఈ తుపాన్ వల్ల పాక్ తో పాటు భారత్ లోని గుజరాత్, యూపీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బిపోర్ జాయ్ అనే పేరును బంగ్లాదేశ్ ప్రతిపాదించింది. దీని అర్థం విపత్తు లేదా ఉపద్రవం.

మాండూస్ తుపాన్: ఈ పేరును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) సూచించింది. అరబిక్‌ భాషలో మాండూస్(Mandous)అంటే ‘నిధి పెట్టె’ అని అర్థం. మాండూస్ తుపాన్ వల్ల ఏపీలోని రాయలసీమ, తెలంగాణతో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురిశాయి. మాండూస్ వల్ల ఏపీలో భారీగా రైతులు నష్టపోయారు.

సెక్లోన్ సిత్రాంగ్ : ఇది బలహీనమైన ఉష్ణమండల తుఫాను. సిత్రంగ్ తుఫాన్ తూర్పు, ఈశాన్య రాష్ట్రాలైన అసోం, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులను గతేడాది ప్రభావితం చేసింది. సిత్రాంగ్ పేరును థాయ్‌లాండ్‌ దేశం సూచించింది. థాయ్ భాషలో సిత్రాంగ్ అంటే వదలనిది అని అర్థం.

అసనీ తుపాన్ : అసనీ తుపాన్ అనేది బంగాళఖాతంలో ఏర్పడింది. ఈ పేరును శ్రీలంక దేశం సూచించింది. సింహళ భాషలో అసని అంటే ‘కోపం’ అని అర్ధం. అసనీ తుపాన్ వల్ల ఏపీతో పాటు ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆయా రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

జవాద్ తుపాన్ : ఈ తుపాన్ బంగాళఖాతంలో ఏర్పడింది. దీనికి జొవాద్‌ అనే పేరును సౌదీ అరేబియా ప్రతిపాదించింది. జవాద్‌ అంటే అరబిక్‌ భాషలో ఉదారమైన లేదా దయగల అనే అర్థాలు ఉన్నాయి. ఈ తుపాన్ వల్ల బంగ్లాదేశ్‌తో పాటు భారత్ పైన ప్రభావం చూపింది. దేశంలోని ఒడిశా, బెంగాల్, అసోంలపై ప్రభావం చూపింది.
గులాబ్ తుపాన్ : బంగాళ ఖాతంలో ఏర్పడిన ఈ తుపాన్ కు ‘గులాబ్’ తుపాన్ అనే పేరును పాకిస్తాన్ సూచించింది. ఉర్దూ భాషలో గులాబ్ అంటే గులాబీ అని అర్థం.

తౌక్తి తుపాన్ : ఈ పేరును మయన్మార్ అందించింది మరియు దీని అర్థం ‘గెక్కో’, ఇది ఒక బల్లి పేరు.

యాస్ తుపాన్ : దీనికి ‘యాస్‌’ అనే పేరును ఒమన్‌ దేశం సూచించింది. ఒమన్ దేశం భాషలో దీనికి మల్లె పువ్వు అని అర్థం.

నిసర్గ తుపాన్ : ఇది మహారాష్ట్రలో తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఈ తుపాన్ కు నిసర్గ అని బంగ్లాదేశ్ సూచించింది. దీని అర్థం ప్రకృతి.

అంపన్ తుపాన్ : ఈ తుపాన్ వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో భారీ వర్షాలు కురిశాయి. దీనికి ఆంపన్ అని థాయ్ లాండ్ సూచించింది. అంపన్ అంటే థాయ్ భాషలో ఆకాశం.

క్యార్ తుపాన్ : 2007 తర్వాత రెండవ బలమైన ఉష్ణమండల తుఫాను ఇది. అరేబియా సముద్రంలో ఈ తుఫాను వచ్చింది. ఈ తుపాన్ కు క్యార్ అనే పేరును మయన్మార్ సూచించింది. దీని అర్థం బర్మా భాషలో క్యార్ అంటే టైగర్ అని అర్థం.

మహా తుపాన్ : 2019లో మహాతుపాన్ సంభవించింది. ఈ పేరును ఒమన్ దేశం సూచించింది.

వాయు తుపాన్ : ఈ తుపాన్ అరేబియా సముద్రంలో ఏర్పడింది. ఈ తుపాన్ పేరును భారత్ సూచించింది. దీని అర్థం గాలి.

హిక్కా తుపాన్ : అరేబియా సముద్రంలో ఈ తుపాన్ వచ్చింది. దీన్ని మాల్దివులు సూచించింది. దీని అర్థం ఎక్కిళ్లు.

ఫణి తుపాన్ : హిందూ మహాసముద్రంలో ఈ తుపాన్ వచ్చింది. ఈ పేరును బంగ్లాదేశ్ సూచించింది. దీని అర్థం శాశ్వతమైన.

బాబ్ 03 తుపాన్ : ఈ పేరును భారత్ సూచించింది. దీన్ని బే ఆఫ్ బెంగాల్ ను ష్టార్ట్ కట్ చేసి పెట్టింది.

బుల్ బుల్ : 2019లో పశ్చిమబెంగాల్ లో వచ్చింది. దీనికి పేరును సూచించింది. దీని అర్థం నైటింగేల్.

మిచాంగ్ : మిచాంగ్ పేరును మయన్మార్ సూచించింది. దీని అర్థం శక్తి, స్థితిస్థాపకత, ధృడత్వం.

 

You may also like

Leave a Comment