సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రతి రోజు 18 గంటలు పని (Work) చేస్తున్నానని తెలిపారు. తనకు వయస్సు ఉందని… ఓపిక కూడా ఉందని…ప్రజ సమస్యలను పరిష్కరించే శక్తి, చిత్తశుద్ది కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
తమ దృష్టికి తీసుకు వస్తే ఆ సమస్యలను తప్పనకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం నేపథ్యంలో కొత్తగా 100 బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. తాను ప్రతిరోజూ 24 గంటల్లో 18 గంటలు పని చేస్తున్నానని చెప్పారు.
అందరూ ఏ చిన్న సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకుని రావాలన్నారు. తమ మంత్రివర్గం ఎల్లప్పుడూ అందరికి అందుబాటులో ఉంటుందన్నారు. ఇది ఇలా వుంటే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ…. ప్రభుత్వం ఏర్పడిన తక్కువ సమయంలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని అమలు చేసిందని తెలిపారు.
మహాలక్ష్మీ ఫథకం ద్వారా రెండు నెలల కాలంలో ఆర్టీసీకి రూ. 507 కోట్ల నిధులు చేకురాయన్నారు. గతంలో కరోనా, డీజిల్ ధరలు, కార్మికుల సమ్మెతో ఆర్టీసీకి తీవ్ర నష్టాలు వచ్చాయని గుర్తు చేశారు. కానీ తాం బాధ్యతలు తీసుకున్నాక పలు సంస్కరణలు తీసుకు వచ్చామని వివరించారు. దీంతో ఆర్టీసీలో కొద్దికొద్దిగా నష్టాలు తగ్గుతున్నాయని చెప్పుకొచ్చారు. త్వరలో 675 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తున్నామన్నారు.