Telugu News » TDP Vs YCP : అమిత్ షా, లోకేష్ భేటీ చుట్టూ ఏపీ రాజకీయం

TDP Vs YCP : అమిత్ షా, లోకేష్ భేటీ చుట్టూ ఏపీ రాజకీయం

అప్పటిదాకా అపాయింట్ మెంట్ దొరకలేదని విమర్శలు చేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు షా కాళ్లు పట్టుకున్నారని ఎటాక్ చేస్తున్నారు.

by admin
ycp tdp war

చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ తర్వాత ఢిల్లీ (Delhi) కి వెళ్లిన ఆయన తనయుడు లోకేష్ (Lokesh) లాయర్లతో సంప్రదింపులు జరిపారు. కేంద్ర పెద్దలను కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్ మెంట్ దొరకలేదని వైసీపీ (YCP) విమర్శలు చేసింది. అయితే.. అమరావతికి తిరిగొచ్చేసిన ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు రావడం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ను కలవడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే.. అప్పటిదాకా అపాయింట్ మెంట్ దొరకలేదని విమర్శలు చేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు షా కాళ్లు పట్టుకున్నారని ఎటాక్ చేస్తున్నారు.

ycp tdp war

తాజాగా ట్విట్టర్(ఎక్స్) లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ఓ పోస్ట్ పెట్టారు. ‘‘అపాయింట్మెంట్ కోసం ఎన్నిసార్లు తిరిగావు. ఎందరి కాళ్ళు పట్టుకున్నావు. అబ్బో! అమిత్ షా గారు నిన్ను కలవాలని తపించినట్లు మళ్లీ మీడియాలో బిల్డప్స్ దేనికి లోకేష్?’’ అంటూ విమర్శలు చేశారు. విజయసాయి ట్వీట్ పై టీడీపీ వర్గాలు గట్టి కౌంటరే ఇస్తున్నాయి. మోడీ కాళ్లపై జగన్ పడుతున్నట్టు ఉన్న ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

టీడీపీ నేత అయ్యన్నప్రాత్రుడు (Ayyanna Patrudu) స్పందిస్తూ.. ‘‘ఏ2 గారూ, దీనిని కాళ్లు ప‌ట్టుకోవ‌డం అంటారు. బాబాయ్‌ ని వేసేసిన అబ్బాయిని త‌ప్పించేందుకు ఢిల్లీ వెళ్లి నువ్వు అపాయింట్మెంట్లు ఇప్పించేందుకు మ‌ళ్లీ మ‌ళ్లీ నువ్వు ప‌ట్టిన కాళ్లు, నువ్వు పిసికిన పాదాలు గుర్తుకొచ్చాయా! క‌న్నింగ్ ప‌నులు చేయ‌డం, కాళ్లు ప‌ట్ట‌డం అల‌వాటైన ఏ1, ఏ2 ప్రాణాల‌కి ఎవ‌రు పిలిచినా, ఎవ‌రు క‌లిసినా అలాగే క‌నిపిస్తుంది క‌దా క‌సాయి రెడ్డీ!’’ అంటూ విజయసాయిని ట్యాగ్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు.

ఇటు టీడీపీ (TDP) శ్రేణులు విజయసాయిని టార్గెట్ చేస్తున్నారు. ‘‘అందరూ నీలా వుండరు కదా ఏ2. నీలా ఓ 30 కేసుల్లో బెయిల్ మీద వుంటూ కోర్టులను తప్పించుకొని తిరిగే బాపతు కాదాయే. కాబట్టి కొన్ని విషయాలు నీకు అర్థం కావులే. నువ్వు 2014-19 మధ్య ఢిల్లీలో ఎన్నిసార్లు ఎంతమంది కాళ్ళు పట్టుకొని మోడీని, అమిత్ షాను కలిశావో అందరికీ తెలుసు’’ అంటూ పాత విషయాలను తవ్వి బయటకు తీస్తున్నారు. మొత్తంగా అమిత్ షా, లోకేష్ భేటీ చుట్టూ టీడీపీ, వైసీపీ మధ్య వార్ కొనసాగుతోంది.

You may also like

Leave a Comment