Telugu News » Veer Yogendra Shukla : భగత్ సింగ్ కు శిక్షణ ఇచ్చిన యోధుడు వీర యోగేంద్ర శుక్లా….!

Veer Yogendra Shukla : భగత్ సింగ్ కు శిక్షణ ఇచ్చిన యోధుడు వీర యోగేంద్ర శుక్లా….!

అటు భగత్ సింగ్, ఇటు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ తో కలిసి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. గాయపడిన జయప్రకాశ్ నారాయణ్ ను తన భుజంపై 120 కిలోమీటర్లు మోసుకుని పోయిన గొప్ప పోరాట యోధుడు.

by Ramu
Yogendra Shukla Served Freedom Movement In Many Ways

వీర యోగేంద్ర శుక్లా (Veer Yogendra Shukla)… భగత్ సింగ్ (Bagath Singh), భట్ కేశ్వర్ దత్ లకు శిక్షణ ఇచ్చిన విప్లవకారుడు. తిర్హత్ కుట్ర కేసులో పదేండ్ల శిక్ష అనుభవించాడు. అటు భగత్ సింగ్, ఇటు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ తో కలిసి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. గాయపడిన జయప్రకాశ్ నారాయణ్ ను తన భుజంపై 120 కిలోమీటర్లు మోసుకుని పోయిన గొప్ప పోరాట యోధుడు.

Yogendra Shukla Served Freedom Movement In Many Ways

1896లో బిహార్‌లో జాలాపూర్ గ్రామంలో జన్మించారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు బైకుంఠ శుక్లాకు ఆయన మామ. ప్రముఖ విప్లవ యోధులు భగత్ సింగ్, భట్ కేశ్వర్ దత్ లకు సీనియర్. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా విప్లవ పోరాటం చేశారు. చంపారన్, దర్బాంగా ప్రాంతాల్లో ధనవంతుల ఇండ్లపై దాడి చేసి దోపిడిలు చేశాడు.

ఈ క్రమంలో 11 జూన్ 1930న శుక్లాను బ్రిటీష్ అధికారులు అరెస్టు చేశారు. తిర్హత్ కుట్ర కేసులో ఆయనకు పదేండ్ల జైలు శిక్ష విధించారు. ఈ కేసులో ఆయన్ని భగల్ పూర్ జైళ్లో నిర్బంధించారు. అక్కడ ఖైదీల పట్ల అధికారుల అమానుష ప్రవర్తను వ్యతిరేకిస్తూ 18 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. అక్కడి నుంచి ఆయన్ని హజరిబాగ్ జైలుకు తరలించారు.

రెండేండ్ల తర్వాతా ఆయన్ని అండమాన్ జైలుకు తరలించగా అక్కడ 64 రోజులు నిరాహార దీక్ష చేశారు. మార్చి 1938న జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ఆల్ ఇండియా కిసాన్ సభలో సభ్యుడిగా చేరారు. జయప్రకాశ్ నారాయణ్ తో కలిసి రైతు ఉద్యమాల్లో పాల్గొన్నారు. హరీనగర్ చెక్కర పరిశ్రమలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు.

9నవంబర్ 1942న క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా అరెస్టు అయ్యారు. ఆ సమయంలో హజరీ బాగ్ జైలు నుంచి జయప్రకాశ్ నారాయణ్, శుక్లాలు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో జయ ప్రకాశ్ నారాయణ గాయపడగా ఆయన్ని తన భుజంపై ఎత్తుకుని 124 కిలో మీటర్లు ప్రయాణించి శుక్లా తప్పించారు.

ఈ క్రమంలో ఆయన్ని పట్టించిన వారికి రూ. 5000 నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. దీంతో నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం 1946లో జైళు నుంచి విడుదలయ్యారు. స్వాతంత్ర్య అనంతరం బిహార్ లో ప్రజాసోషలిస్టు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 19 నవంబర్ 1960న మరణించారు.

You may also like

Leave a Comment