Telugu News » J&K Encounter: జమ్మూ కశ్మీర్‌ ఎన్‌ కౌంటర్‌ లో అమరులైన ఇద్దరు ఆర్మీ అధికారులు..ఓ పోలీసు అధికారి!

J&K Encounter: జమ్మూ కశ్మీర్‌ ఎన్‌ కౌంటర్‌ లో అమరులైన ఇద్దరు ఆర్మీ అధికారులు..ఓ పోలీసు అధికారి!

నిస్వార్థ సేవను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు

by Sai
encounter in jammu and kashmir anantnag dist two army officers and one police officer killed

జమ్మూకశ్మీర్‌(JammuKashmir) లోని అనంత్‌నాగ్(Ananthnag dist) జిల్లా లో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌ (Encounter) లో భారత ఆర్మీ కల్నల్(Colonel), ఒక మేజర్(Major), ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. అనంత్‌నాగ్ జిల్లాలోని కోకెర్‌నాగ్ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిందని పోలీసులు వెల్లడించారు.

encounter in jammu and kashmir anantnag dist two army officers and one police officer killed

ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని వెతకడానికి ఆర్మీ అధికారులు వెళ్లారు. ఆ క్రమంలో అక్కడే ఉన్న ఉగ్రవాదులు ఆర్మీ అధికారులపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో జవాన్లు కూడా ధీటుగా ఎదురుకాల్పులు చేశారు. కానీ ఆ క్రమంలో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమన్యున్ ముజామిల్ భట్ ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఎన్‌కౌంటర్ ఆపరేషషన్లో భద్రతా దళాలు పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రి, పాకిస్తాన్ ఆధారిత పలు వస్తువులను స్వాధీనం చేస్తున్నారని అధికారులు తెలిపారు. అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన జవాన్లకు కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నివాళులర్పించారు. వీరి నిస్వార్థ సేవను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. అమరవీరుల కుటుంబానికి తన సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ కాల్పుల్లో ఓ సైనికుడిని రక్షించే క్రమంలో కెంట్ అనే ఆరేళ్ల ఇండియన్ ఆర్మీ కుక్క ప్రాణాలు కోల్పోయింది. నార్లా గ్రామంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అయితే సైనికుల బృందానికి నేతృత్వం వహిస్తున్న ఆ కుక్క భారీ కాల్పుల మధ్య చిక్కుకుంది.

21వ ఆర్మీ డాగ్ యూనిట్ లోని లాబ్రడార్ జాతికి చెందిన ఆడ కుక్క కెంట్ తన హ్యాండ్లర్ ను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు అర్పించింది. పారిపోతున్న ఉగ్రవాదుల కనిపెట్టేందుకు కెంట్ సైనికుల బృందానికి నేతృత్వం వహిస్తోంది. భారీ ఎదురుకాల్పుల్లో అది కూలిపోయింది’’అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

దీంతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ సందర్భంగా దాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఆ ధైర్యవంతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.

You may also like

Leave a Comment