అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షం పై.. ప్రతిపక్షంలో ఉన్నవారు అధికార పార్టీపై ఆరోపణలు తీవ్రస్థాయిలో చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ తంతు జరుగుతుంది. ఈ నేపథ్యంలో జనసేన (Janasena) పీఏసీ చైర్మన్ ( PAC Chairman) నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar).. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో గత ప్రభుత్వం హయాంలో స్కామ్‌లు జరిగాయని ఆరోపిస్తూ సీఐడీ (CID) కేసులు పెడుతుంది. అవినీతికి సాక్ష్యాలు అంటూ కోర్టును ఆశ్రయించిన కీలక వ్యక్తులను సైతం అరెస్ట్ చేస్తోందని ఆరోపించారు..
వైసీపీ (YCP) ప్రభుత్వంపై కూడా అవినీతి ఆరోపణలు చేస్తున్న విపక్షాలు రూ.2,850 కోట్లు పశువుల స్కామ్ లో దోచేశారని ఆరోపిస్తున్న విషయం గమనించండని నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాదెండ్ల.. అభివృద్థి, సంక్షేమం అంటూ ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు. క్షేత్ర స్థాయిలో 3.85 లక్షల పశువులు కనపడటం లేదని.. 4.75 లక్షల పాడి పశువులు కొనడానికి కేబినెట్ తీర్మానం చేయడం విడ్డూరంగా ఉందని నాదెండ్ల తెలిపారు.
32 కోట్లు పశువులు కొనుగోలుగు కేటాయించామని శాసనసభలో మంత్రి తెలుపడం.. అదీ ఒక్క రోజులో 1.20 లక్షల పశువులు కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపడం ప్రభుత్వ అవినీతికి అద్దం పడుతుందని నాదెండ్ల విమర్శించారు. క్షేత్రస్థాయిలో 8 వేల పశువులు మాత్రమే కొన్న ప్రభుత్వం.. పశువుల పేరు చెప్పుకుని రూ.2,850 కోట్లు దోచుకోవడం ఏంటని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
సామాన్యులకు అర్థం కాని విధంగా దోపిడికి తెరతీయడం వెనక సీఎం హస్తం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు నాదెండ్ల మనోహర్. ఇలా ప్రజా ధనాన్ని లూటీ చేస్తూ జనానికి చెవిలో పువ్వు పెడుతున్న ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పాలని పేర్కొన్న నాదెండ్ల పరోక్షంగా వైసీపీ ని విమర్శించారని అనుకుంటున్నారు.