Telugu News » Double Bedroom : డబుల్ కష్టాలు.. అసలు లెక్కలు బయటకు రావాలంటున్న విపక్షాలు!

Double Bedroom : డబుల్ కష్టాలు.. అసలు లెక్కలు బయటకు రావాలంటున్న విపక్షాలు!

తెలంగాణలో ఎంతమందికి ఇళ్లు ఇస్తున్నారు.. మీకు అసలు ఆ డేటా తెలుసా.. ఒకసారి తెలుసుకోండి అంటూ సెటైర్లు వేశారు. 2.16 లక్షల ఇండ్లు కట్టినట్లు గూగుల్ ద్వారా తెలిసిందని.. కానీ లక్ష ఇళ్ళు కూడా కట్టలేదని ఆరోపించారు.

by admin
2bhk-houses

కొత్తగా రాష్ట్రం ఏర్పాటైనప్పటికీ తొమ్మిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమంలో జోడెద్దుల మాదిరిగా తెలంగాణ రాష్ట్రం ప్రగతి బాటలో ముందుకెళ్తోందనేది బీఆర్ఎస్ (BRS) నేతల వాదన. కేసీఆర్ (KCR) పాలనలో ప్రగతి పథంలో ముందుకెళ్తున్నామని చెబుతున్నారు. తాజాగా డబుల్ బెడ్రూం ఇళ్ల రెండో విడత పంపిణీ ప్రారంభం సందర్భంగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు గులాబీ నేతలు. అయితే.. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో ప్రభుత్వానికి డ్రామా అనేది విపక్షాల వాదన.

2bhk-houses

డబుల్ బెడ్రూం ఇళ్ల రెండో విడుత పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్ (KTR) ఏదేదో మాట్లాడారని మండిపడ్డారు ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh). తెలంగాణలో ఎంతమందికి ఇళ్లు ఇస్తున్నారు.. మీకు అసలు ఆ డేటా తెలుసా.. ఒకసారి తెలుసుకోండి అంటూ సెటైర్లు వేశారు. 2.16 లక్షల ఇండ్లు కట్టినట్లు గూగుల్ ద్వారా తెలిసిందని.. కానీ లక్ష ఇళ్ళు కూడా కట్టలేదని ఆరోపించారు. ‘‘తెలంగాణ ప్రజలు ఇండ్లు కావాలని అంటున్నారు. మీరు డబుల్ బెడ్రూం ఇస్తారా? సింగిల్ బెడ్రూం ఇస్తారా? అనేది ప్రజలకు అనవసరం. మీరు మంచి చేస్తే వారే ధన్యవాదాలు చెబుతారు. 25 లక్షల మందకిపైగా ప్రజలు ఇండ్లు లేవని దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఎంతమందికి ప్రభుత్వం ఇండ్లు ఇస్తుందో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు రాజాసింగ్.

మరోవైపు, స్థానికులకే డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని మహేశ్వరం నియోజకవర్గంలో ఆందోళనకు దిగారు స్థానికులు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్సాన్ పల్లిలోని ప్రజలు చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి రాస్తోరోకో నిర్వహించారు. మన్సాన్ పల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించే సమయంలో ఈ ఆందోళన చేశారు. వీరికి ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి.

2bhk houses protest

డబుల్ బెడ్రూం ఇండ్లను ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివసించే స్థానికులకు ఇవ్వడం లేదని ఆరోపించారు. తక్షణమే ఇండ్లను స్థానికులకు కేటాయించి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చి నిరసనకారులను అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. ఆ సమయంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

You may also like

Leave a Comment