నేటి కాలంలో చిన్న కారణాన్ని చూపి పెద్ద గొడవ చేసే వారు ఎక్కువ అవుతున్నారు. సర్దుకుపోయే గుణం ఉంటే అందరు మనవాళ్లే.. కానీ ఆ గుణమే లేకుంటే ప్రతి వారు వ్యతిరేకంగా కనిపిస్తారు.. ప్రస్తుతం ఓ వివాహ కార్యక్రమంలో ఇలాంటి కారణం పెద్ద గోడవకు దారితీసింది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో చోటుచేసుకున్నఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటే..
ఉత్తరప్రదేశ్ లోని శంషాబాద్ ప్రాంతం (Shamsabad area)లో ఓ వివాహ వేడుక (Wedding Function) జరిగింది. ఈ పెళ్ళికి వచ్చిన అతిథులకు రసగుల్లాలు వడ్డించలేదని జరిగిన గొడవ తీవ్ర ఘర్షణకు దారితీసింది. అప్పటికే రసగుల్లాలు అయిపోయాయని చెప్పిన వినకుండా పెళ్ళికి వచ్చిన వారిలో కొందరు దురుసుగా ప్రవర్తించడంతో మాటకు మాట పెరిగి దాడి చేసుకునే వరకు వెళ్ళింది.
రసగుల్లాలు (Rasagulla) పెట్టిన చిచ్చు వల్ల ఒకరికొకరు తీవ్రంగా కొట్టుకున్నట్టు సమాచారం.. ఈ ఘర్షణల్లో ఆరుగురు వ్యక్తులు గాయపడినట్లు తెలుస్తుంది. కాగా ఘర్షణ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేసుకుని గోడవను ఆపారు. కానీ అప్పటికే జరగవలసిన కథ జరిగిపోయింది. మరోవైపు గోడవలో గాయపడ్డ వారు భగవాన్ దేవి, యోగేష్, మనోజ్, కైలాష్, ధర్మేంద్ర, పవన్‌గా గుర్తించిన పోలీసులు చికిత్స నిమిత్తం వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక పోలీసు అధికారి అనిల్ శర్మ వెల్లడించారు. రసగుల్లా తినకుంటే కడుపు ఏం కొట్టదు కదా.. కానీ ఇలా ఆలోచించేవారు చాలా తక్కువ మంది ఉంటారు.. సర్దుకుపోతే సగం సమస్యలు తీరుతాయని ఈ విషయం తెలిసిన వారు అనుకుంటున్నారు..