Telugu News » Delhi: ప్రమాద ఘంటికలు.. ఢిల్లీలో లాక్‌డౌన్ తరహా ఆంక్షలు…?

Delhi: ప్రమాద ఘంటికలు.. ఢిల్లీలో లాక్‌డౌన్ తరహా ఆంక్షలు…?

ఘజియాబాద్‌లో 229గా అటు ముండ్కాలో గాలి నాణ్యత సూచీ 396 నమోదైనట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. ఢిల్లీలో వాయుకాలుష్యం పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్(Lockdown) తప్పదని నిపుణులు అంటున్నారు.

by Mano
Delhi: Alarm bells.. Lockdown-like restrictions in Delhi...!

దేశ రాజధాని ఢిల్లీ(Delhi) వాయు నాణ్యత సూచీ తాజాగా ప్రమాద ఘంటికలను సూచిస్తోంది. చేరుకుంది. ఢిల్లీలో వాయుకాలుష్యం పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్(Lockdown) తప్పదని నిపుణులు అంటున్నారు. విద్యాసంస్థలను కూడా మూసివేసే అవకాశాలున్నాయి. జనం ప్రైవేట్ వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. పార్కింగ్‌ ఫీజులు పెంచాలని, ఎలక్ట్రిక్‌ బస్సులు, మెట్రో సర్వీసులను పెంచాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.

Delhi: Alarm bells.. Lockdown-like restrictions in Delhi...!

ఢిల్లీలో వాయుకాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది.ఎయిర్ ఇండిక్స్‌ 245గా నమోదైంది. అటు నోయిడాలోనూ గాలి నాణ్యత 204కి పడిపోయింది. దీపావళికి ముందే ఢిల్లీ, నొయిడాలో వాయుకాలుష్యం పెరుగుతుండడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఘజియాబాద్‌లో 229గా అటు ముండ్కాలో గాలి నాణ్యత సూచీ 396 నమోదైనట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది.

వాయు కాలుష్యం ఇలాగే కొనసాగితే ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలను పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యోచిస్తోంది. అటు హోటళ్లు, రెస్టారెంట్‌లో బొగ్గు వాడకంపై నిషేదం విధించాలని ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ అధికారులను ఆదేశించారు. ఫ్యాక్టరీలతో పాటు థర్మల్ పవర్‌ప్లాంట్‌లపై చర్యలు తీసుకోనున్నారు.

మూడున్నర నెలల నుంచి స్వచ్ఛమైన గాలే ఉన్నప్పటికీ ఢిల్లీలో ఈసారి రుతుపవనాలు ముందే వచ్చాయి. వర్షాలు కూడా బాగానే కురిశాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ మొదటి వారం నుంచి గాలి నాణ్యత తగ్గుతూ వచ్చింది. ఇక లాక్‌డౌన్ తరహా ఆంక్షలు విధించే అవకాశాలు ఉండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

You may also like

Leave a Comment