Telugu News » Nijam Gelavali Yatra: నేటి నుంచి భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర..!

Nijam Gelavali Yatra: నేటి నుంచి భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర..!

బాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను నేటి నుంచి భువనేశ్వరి (Bhuvaneshwari) పరామర్శించనున్నారు. ఈ యాత్ర నిజం గెలవాలి పేరుతో చేపట్టనున్నారు. ఈ మేరకు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి యాత్ర మొదలవుతున్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి.

by Venu

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ వల్ల ఏపీలో సైకిల్ స్పీడ్ కాస్త తగ్గిందని అందరూ అనుకుంటున్నారు.. కానీ ఆ బాధ్యతలను జననేత పవన్ తో పాటు లోకేష్, నారా భువనేశ్వరి, బ్రహ్మాణి టీడీపీకి పొలిటికల్ మైలేజ్ అందించడానికి ప్రజల్లోకి వెల్లుతున్నారని కార్యకర్తలు సంతోష పడుతున్నారు. బాలయ్య అప్పుడప్పు ఓ చేయి వేస్తూ తనవంతు బాధ్యతను నిర్వహిస్తున్నాడని టీడీపీ అనుచరులు అనుకుంటున్నారు.

మరోవైపు బాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను నేటి నుంచి భువనేశ్వరి (Bhuvaneshwari) పరామర్శించనున్నారు. ఈ యాత్ర నిజం గెలవాలి (Nijam Gelavali Yatra) పేరుతో చేపట్టనున్నారు. ఈ మేరకు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి యాత్ర మొదలైంది. కాగా నేటి నుంచి భవనేశ్వరి వారానికి మూడు రోజుల పాటు కార్యకర్తలు, నేతల ఇళ్లకు వెళ్లి ఓదార్చనున్నారు. స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ పాల్గొననున్నారు..

అయితే ఈ యాత్రకు ముందు తిరుమల శ్రీవారిని భువనేశ్వరి దర్శించుకున్నారు.. తర్వాత వారి స్వగ్రామం నారావారి పల్లెలో ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు దాదాపు 47రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబుకు మద్దతిస్తూ రోడ్డెక్కిన ప్రజలకు, ఆయా వర్గాల వారికి భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. మరో వైపు నిజం గెలవాలి యాత్రలో భాగంగా ముందుగా నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు భువనేశ్వరి.

అనంతరం చంద్రగిరి బజారువీధిలో.. ప్రవీణ్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా టీడీపీ సోషల్ మీడియాలో ప్రవీణ్‌రెడ్డి యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు జీర్ణించకోలేని ప్రవీణ్‌ ఆవేదనతో ఈనెల 18వ తేదీన మృతి చెందారు.

ఇక నవంబరు 1నుంచి.. చంద్రబాబు అరెస్టుతో నిలిచిన బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని పునరుద్ధరించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలకు.. జనసేన (Janasena) చేసిన సిఫార్సులను జోడించి ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు టీడీపీ ముఖ్య నేతలు..

You may also like

Leave a Comment