Telugu News » Purandeswari: అదాన్ కంపెనీ వెనుక వైసీపీ ఎంపీ..? పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు!

Purandeswari: అదాన్ కంపెనీ వెనుక వైసీపీ ఎంపీ..? పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు!

ఏపీలోని డిస్టలరీస్ యజమానుల వివరాలు అడిగితే జగన్ ప్రభుత్వం స్పందించలేదన్నారు పురంధేశ్వరి. రూ.1164 కోట్ల మేర మద్యం సరఫరా ఆర్డర్ అదాన్ కంపెనీకే ఉన్నాయని, అదాన్ కంపెనీ వెనుక విజయసాయిరెడ్డి ఉన్నారని ఆరోపించారు.

by Mano
Purandeswari: Adding money instead of water in the name of projects: Purandeswari

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(Ycp mp vijayasai reddy)పై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. అదాన్ కంపెనీల వెనుక ఆయన ఉన్నారని ఆరోపించారు. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏపీలోని డిస్టలరీస్ యజమానుల వివరాలు అడిగితే జగన్ ప్రభుత్వం స్పందించలేదన్నారు. రూ.1164 కోట్ల మేర మద్యం సరఫరా ఆర్డర్ అదాన్ కంపెనీకే ఉన్నాయని, అదాన్ కంపెనీ వెనుక విజయసాయిరెడ్డి ఉన్నారని పురంధేశ్వరి ఆరోపించారు.

Purandeswari: YCP MP behind Adan Company..? Purandheswari Key Comments!

అంతేకాకుండా  ‘ఈ రెండు కంపెనీలను అదాన్ బలవంతంగా చేజిక్కించుకుంది. చింతకాయల రాజేష్, పుట్టా మహేష్ వంటి వారికి చెందిన సంస్థలను బలవంతంగా అదాన్ కంపెనీ చేజిక్కించుకుంది. ఎస్పీవై అగ్రస్ సంస్థకు రూ.1800 కోట్ల మేర సరఫరా ఆర్డర్ ఉన్నాయి. ఈ సంస్థ వెనుక మిధున్‌రెడ్డి ఉన్నారు. ప్రకాశం జిల్లాలో పెర్ల్ డిస్టలరీస్ దీన్ని సీఎం జగన్ సన్నిహితులు బలవంతం పెట్టి సబ్ లీజుకు తీసుకున్నారు.’ అని తెలిపారు.

ఏపీ బెవరెజెస్ కార్పోరేషన్ వద్ద 100కు డిస్టలరీ కంపెనీలు నమోదైతే 74శాతం మద్యం సరఫరాను కేవలం 16 కంపెనీలే చేస్తున్నాయని, అదాన్ డిస్టలరీస్ 2019లో మొదలైందని తెలిపారు. దశలవారీ మధ్య నిషేదం చేస్తామని, మద్యం తయారీదారులని, అమ్మకం దారులని ఏడేళ్ల పాటు జైలుకు పంపుతామన్నారని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు పురంధేశ్వరి గుర్తుచేశారు. ఇప్పుడు మద్యం తయారీదారుల జాబితా విడుదల చేసినా ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.

మద్య నిషేధం అమలు చేయబోమని చెప్పి మరీ మద్యాదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. ఫోన్ పే.. గూగుల్ పే వంటివి మద్యం దుకాణాల్లో ఎందుకు కన్పించవు. ఏపీ ఆన్‌లైన్ అనే యాప్ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు చేస్తామంటూ ప్రకటించారు కానీ.. అది పని చేయడం లేదని చెబుతున్నారు. మద్యం అవకతవకలపై విచారణ చేయించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరాం. అలాగే ఏపీ ఆర్థిక స్థితిగతులపై నిర్మలా సీతారామన్ ను ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలని కోరాం’ అని పురందేశ్వరి అన్నారు.

You may also like

Leave a Comment