Telugu News » Jeevan Reddy : ధరణి పేరుతో కొట్లాటలు.. కారణం ఎవరంటే..?

Jeevan Reddy : ధరణి పేరుతో కొట్లాటలు.. కారణం ఎవరంటే..?

రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏ(VRA) వీఆర్వో (VRO)లను ఎందుకు రద్దు చేసిందో తెలియడం లేదన్నారు. ప్రభత్వం తీసుకొన్న అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో ధరణి వల్ల భూ సమస్యలు ఉత్పన్నమయ్యాయని..ధరణి సమస్యలు లేని గ్రామమే లేదన్నారు జీవన్ రెడ్డి

by Venu
MLC Jeevan Reddy: Governor's delay on resignations is inappropriate: MLC Jeevan Reddy

తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress) బీఆర్ఎస్ (BRS) పార్టీల మధ్య కత్తులు లేకుండా యుద్ధం నడుస్తుంది. ఈ పొలిటికల్ వార్ లో నేతల మాటలు పదునైన ఆయుధంగా మారుతున్నాయి అనడానికి ఎన్నికల ప్రచారాల్లో వినిపిస్తున్న విమర్శలు చాలు.. ఈ పార్టీల్లోని ముఖ్య నేతలంతా ఒకరిపై ఒకరు సెన్సార్ కటింగ్ లేకుండా దూషించుకుంటున్నారు.

మరోవైపు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) తనదైన స్టైల్లో పంచులు వేశారు.. అధికార పార్టీని ఉద్దేశిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏ(VRA) వీఆర్వో (VRO)లను ఎందుకు రద్దు చేసిందో తెలియడం లేదన్నారు. ప్రభత్వం తీసుకొన్న అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో ధరణి వల్ల భూ సమస్యలు ఉత్పన్నమయ్యాయని..ధరణి సమస్యలు లేని గ్రామమే లేదన్నారు జీవన్ రెడ్డి..

బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రిజిస్ట్రేషన్ లకు ఫీజులు భారీగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.. పట్టా మార్పిడి రుసుం పేరుతో ప్రతి ఎకరాకు రూ. 2500 కట్టించుకొంటున్న కేసీఆర్ మీకు చిత్త శుద్ది ఉంటే పట్టా మార్పిడి ఫీజు రద్దు చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరణిలో నమోదు కానీ డాక్యుమెంట్స్ వేలల్లో ఉన్నాయని పేర్కొన్నారు.. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థలను పునరుద్దరిస్తామని జీవన్ రెడ్డి తెలిపారు..

రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి నాలుగు నెలల్లో ధరణి సమస్యలను పరిష్కరిస్తామని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక మంత్రి హరీష్ రావు నోరు అబద్దాల పుట్ట అని విమర్శించిన జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పటేల్ పట్వారీ వ్యవస్థ మొదలవుతుందనడం ప్రజలను భయపెడుతున్నట్టు ఉంది అని మండిపట్టారు.

అసలు పటేల్ పట్వారీ వ్యవస్థకు, ధరణికి ఏం సంబంధం అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. పటేల్ పట్వారీ వ్యవస్థ కేసీఆర్ ఎమ్మెల్యే కాకముందే రద్దయిందని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో 30వేల నిరుద్యోగుల కొత్త ఉద్యోగాలను కొల్లగొట్టిన కేసీఆర్.. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది కొలువులను ఇవ్వడానికా..? లేక తీయడానికా అని నిలదీశారు. మళ్ళీ తెలంగాణలో దొరల పాలనకు బోణి కొట్టింది మీరని జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పై మండిపడ్డారు..

You may also like

Leave a Comment