Telugu News » Narayana: లిక్కర్ స్కామ్‌లో ఆ పార్టీ నేతలను ఎందుకు అరెస్టు చేయడం లేదు……!

Narayana: లిక్కర్ స్కామ్‌లో ఆ పార్టీ నేతలను ఎందుకు అరెస్టు చేయడం లేదు……!

రూ. 100 కోట్ల లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్, వైసీపీ నేతలు నిందితులుగా ఉన్నా వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆయన నిలదీశారు.

by Ramu

సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె కవితను మోడీ సర్కార్ ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రూ. 100 కోట్ల లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్, వైసీపీ నేతలు నిందితులుగా ఉన్నా వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆయన నిలదీశారు.

 

ముగ్దుం భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. తమకు అనుకూలంగా ఉన్న వారి పట్ల ఒక తీరు, వ్యతిరేకంగా ఉన్న వారి పట్ల మరో తీరు వ్యవహరిస్తోందన్నారు. లిక్కర్ కుంభకోణంతో సంబంధం ఉన్న రాష్ట్రాలకు సంబంధించి ఆ రెండు పార్టీల్లోని నేతలను అరెస్టు చేయకుండా కేవలం ఢిల్లీలో సిసోడియాను అరెస్టు చేయడాన్ని ఆయన తప్పు బట్టారు.

ఇది ముమ్మాటికీ బీజేపీ రాజకీయ కుట్రలో భాగమేనని మండిపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్టు ఘటన పూర్తిగా బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యమేనన్నారు. ఆ ఘటనపై జిల్లా ఎస్పీ ఓ సారి ఓ సారి విద్రోహ చర్య అంటున్నారని, మరోసారి సాంకేతికమైన తప్పు అని చెబుతున్నారని అన్నారు. ఎస్పీ వ్యాఖ్యలను బట్టి చూస్తే పరిస్థితి పూర్తగా అర్థమవుతోందన్నారు.

బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ ఓకే చెట్టు కొమ్మలని ఆరోపించారు. తమకు చెన్నూరు, కొత్తగూడెం స్థానాలను కాంగ్రెస్ కేటాయించిందని చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టు లోపాలను గుర్తించేందుకు తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రాజెక్టును సందర్శిస్తామన్నారు. ఐదు రాష్ట్రాల్లో విజయం సాధించేందుకు రాజ్యాంగాన్ని , నీతి నియమాలను బీజేపీ తుంగలో తొక్కిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి సనాతన ధర్మం పేరిట కుల, మత విద్వేషాలను పెంచి ప్రజల మధ్య వైశ్యమ్యాలు బీజేపీ సృష్టిస్తోందన్నారు.

You may also like

Leave a Comment