Telugu News » Hari Singh Nalwa: లయన్ ఆఫ్ పంజాబ్…. హరి సింగ్ నల్వా…!

Hari Singh Nalwa: లయన్ ఆఫ్ పంజాబ్…. హరి సింగ్ నల్వా…!

8000 మంది సిక్కు సైనికులతో కలిసి 1,60,000 మంది ఉన్న యూసఫ్ జాహీ సైన్యాన్ని ఊచ కోత కోసి మహారాజ రంజిత్ సింగ్ కు అపూర్వ విజయాన్ని అందించిన గొప్ప వీరుడు ఆయన.

by Ramu

హరిసింగ్ నల్వా (Hari Singh Nalwa)…అందరూ ఆయన్ని పంజాబ్ సింహం (Lion of Punjab) అని పిలుస్తారు. యూసఫ్ జాయ్‌లతో జరిగిన యుద్దం ఆయన శక్తి సామర్థ్యాలకు ఒక గొప్ప నిదర్శనం. 8000 మంది సిక్కు సైనికులతో కలిసి 1,60,000 మంది ఉన్న యూసఫ్ జాహీ సైన్యాన్ని ఊచ కోత కోసి మహారాజ రంజిత్ సింగ్ కు అపూర్వ విజయాన్ని అందించిన గొప్ప వీరుడు ఆయన.

సింధు ప్రాంతంలోని ఖైబర్ పఖ్తున్వా ప్రాంతంపై ఆధిపత్యం కోసం యూసఫ్ జాయ్‌లు పంజాబ్ ప్రాంతంపై దండెత్తారు. విషయం తెలుసుకున్న మహారాజా రంజింత్ సింగ్ యూసప్ జాయ్‌ల సైన్యాన్ని తరిమి కొట్టేందుకు బుద్ సింగ్ సందన్ వాలియా నేతృత్వంలో తన సైన్యాన్ని అటాక్ ప్రాంతం వైపు పంపారు.

యూసుఫ్‌జాయ్ తెగలకు సయ్యద్ అహ్మద్ నాయకత్వం వహిస్తున్నాడు. అటాక్ కోటపై దాడి చేసుందుకు ఖరాబాద్ కోట సమీపంలోకి చేరుకున్నాడు. సమయం చూసి అటాక్ కోటపైకి దండెత్తాడు. అప్పటికే అక్కడ అటాక్ కోటకు హరి సింగ్ నల్వా కాపలాగా వున్నాడు. సయ్యద్ తన 1,60,000 మంది సైనికులతో అటాక్ కోటపై దాడికి దిగాడు.

వెంటనే 8000 మంది సిక్కు సైన్యం యూసఫ్ జాయ్ లను అడ్డుకునేందుకు రెడీ అయింది. లెక్క కడితే ఒక్కో సిక్కు సైనికునికి ఎదురుగా 20 మంది యూసస్ జాయ్‌లు ఉన్నారు. కానీ అవేవి పట్టించు కోకుండా సిక్కు సైన్యం హరి సింగ్ నల్వా నేతృత్వంలో యూసఫ్ జాయ్ లను ఊచకోత కోశాయి. దీంతో దెబ్బకు యూసఫ్ జాయ్ సైన్యం తోక ముడిచి అక్కడి నుంచి పారిపోయింది.

You may also like

Leave a Comment