Telugu News » Bathukamma: గ్లాస్గో, లివింగ్ స్టన్ లల్లో ఘనంగా బతుకమ్మ పండుగ…..!

Bathukamma: గ్లాస్గో, లివింగ్ స్టన్ లల్లో ఘనంగా బతుకమ్మ పండుగ…..!

తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలు ఆకర్షణీయంగా నిలిచాయి.

by Ramu
bathukamma celebrated grand scale in glasgo

ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల బతుకమ్మ (Bathukamma) పండుగను ఘనంగా జరుపుకున్నారు. బ్రిటన్‌ (Britan)తో పాటు స్కాట్లాండ్, గ్లాస్గో, ఎడిన్ బర్గ్‌లో ప్రవాసీ తెలుగు మహిళలు బతుకమ్మ ఆడారు. తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలు ఆకర్షణీయంగా నిలిచాయి.

bathukamma celebrated grand scale in glasgo

మహిళలంతా సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడి మురిసి పోయారు. చప్పట్లకు అనుగుణంగా అడుగులు వేస్తూ బతుకమ్మ ఆడారు. పలు ప్రాంతాల్లో మహిళలు దాండియా కర్రలతో కోలాటం ఆడారు. దీంతో ఆయా ప్రాంతాల్లో తెలుగుదనం విరబూసింది.

అనంతరం బతుకమ్మను నిమజ్జనం చేశారు. తర్వాత ఇస్తినమ్మా వాయనం.. పుచ్చుకుంటినమ్మా వాయనం అంటూ వాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు. గ్లాస్గో, లివింగ్ స్టన్ లల్లో మమత వుసికల, వినీల బతుకమ్మ, సబిత పూసాలు బతుకమ్మ ఈవెంట్‌లను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగు వాళ్లు పాల్గొన్నారు.నేటి తరానికి పండుగల ప్రాముఖ్యతను వివరించేందుకు ఇలాంటి ఈవెంట్స్ చాలా ఉపయోగపడుతాయని పలువురు అన్నారు. తమ చిన్నతనంలో గ్రామాల్లో బతుకమ్మ ఆడిన రోజులను గుర్తు చేసుకుని పలువురు ఎమోషనల్ అయ్యారు.

You may also like

Leave a Comment