Telugu News » China : గుండెపోటుతో మరణించిన చైనా మాజీ ప్రధాని..!

China : గుండెపోటుతో మరణించిన చైనా మాజీ ప్రధాని..!

చైనా ప్రధానిగా లీ కెకియాంగ్ 2013 నుంచి మార్చి 2023 వరకు కొనసాగారు. అయితే అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సం‍స్కరణల మేధావిగా పేరున్న కెకియాంగ్‌ను తొక్కేశారనే రాజకీయ విమర్శ ప్రచారంలో ఉంది. మరోవైపు లీ కెకియాంగ్‌ కి రాజకీయ నేపథ్యం కూడా ఉంది.

by Venu

చైనా (China)మాజీ ప్రధాని లీ కెకియాంగ్(68) (Li Keqiang) గుండెపోటు (Heart Attack)తో కన్నుమూశారు (Passed Away). శుక్రవారం తెల్లవారుజామున అకాల మరణం చెందారు.. కాగా గురువారం షాంఘైలో తీవ్రమైన గుండెపోటుకి గురైన కెకియాంగ్ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ఆయన మరణించినట్టు చైనా మీడియా తెలిపింది.

మరోవైపు చైనా ప్రధానిగా లీ కెకియాంగ్ 2013 నుంచి మార్చి 2023 వరకు కొనసాగారు. అయితే అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సం‍స్కరణల మేధావిగా పేరున్న కెకియాంగ్‌ను తొక్కేశారనే రాజకీయ విమర్శ ప్రచారంలో ఉంది. మరోవైపు లీ కెకియాంగ్‌ కి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఆయన తండ్రి అన్హూయి ప్రావిన్స్‌కు చెందిన ఓ రాజకీయ నేత అని తెలుస్తుంది. మాజీ బ్యూరోక్రాట్‌ అయిన లీ కెకియాంగ్ రాజకీయాల్లో నేతలకు స్వేచ్ఛ నిర్ణయాలు ఉండాలని ఆశించేవాడు.

లీ కెకియాంగ్ పార్టీ అధినేతగా ఉన్న సమయంలో హెనాన్ ప్రావిన్స్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరం ద్వారా హెచ్‌ఐవీ.. ఎయిడ్స్‌ కేసులు అధిక సంఖ్యలో రికార్డు కావడంతో ఆయన ప్రతిష్ట ఘోరంగా దెబ్బతింది. తరువాతి కాలంలో అధికారాలను పరిమితం చేయడం ద్వారా లీ కెకియాంగ్‌ను ఓ కీలుబొమ్మ ప్రధానిగా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మార్చేశారని చైనా మేధావులు తరచూ విమర్శిస్తుంటారు. ముఖ్యంగా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో సమర్థుడైన కెకియాంగ్‌ సేవల్ని కరోనా సంక్షోభంలో జిన్‌పింగ్‌ ఉపయోగించు కోలేదని ఇక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.

You may also like

Leave a Comment