Telugu News » Israel-Hamas War: విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. ముగ్గురు కీలక కమాండర్లు హతం..!

Israel-Hamas War: విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. ముగ్గురు కీలక కమాండర్లు హతం..!

ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో హమాస్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు కీలక కమాండ్లు హతమయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ మిలిటరీ( Israel Defense Forces)తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది.  

by Mano
Israel-Hamas War: Breaking Israel.. Three key commanders killed..!

ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం భీకరంగా జరుగుతోంది. వరుస దాడులతో ఇరుదేశాల్లో పరిస్థితులు భయంకరంగా మారాయి. ఇజ్రాయెల్‌లోని పలు నగరాల్లో ఉగ్రవాద సంస్థ హమాస్  మిలిటెంట్ల దాడులు చేయగా.. వాటిని తిప్పి కొట్టేందుకు వివాదాస్పద గాజాపై ఇజ్రాయెల్‌ సేనలు ప్రతిదాడులు చేస్తున్నాయి.

Israel-Hamas War: Breaking Israel.. Three key commanders killed..!

తాజాగా ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో హమాస్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు కీలక కమాండ్లు హతమయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ మిలిటరీ( Israel Defense Forces)తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది.  ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ ఇటీవలే మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే (Israel-Hamas War). దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ సైతం హమాస్‌పై ఎదురుదాడికి దిగింది. గాజా (Gaza)లోని హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు కొనసాగిస్తోంది.

హమాస్‌ను తుదముట్టించాలన్న లక్ష్యంతో వైమానిక దాడులతో గాజాపై విరుచుకుపడుతోంది. తాజాగా జరిపిన దాడుల్లో హమాస్‌కు చెందిన కీలక కమాండర్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ మిలిటరీ తాజాగా ప్రకటించింది. తమ ఫైటర్‌ జెట్లు జరిపిన దాడిలో హమాస్‌లోని దారాజ్‌ తుఫా బెటాలియన్‌కు చెందిన ముగ్గురు కీలక ఆపరేటర్లు హతమైనట్లు వెల్లడించింది. మృతి చెందిన వారి ఫొటోలను కూడా ట్విట్టర్‌ (ఎక్స్‌) ద్వారా విడుదల చేసింది.

దారాజ్‌ తఫా బెటాలియన్ అనేది గాజా సిటీ బ్రిగేడ్‌లోని ఒక బెటాలియన్ అని ఇజ్రాయెల్‌ మిలిటరీ తెలిపింది. ఇది ఉగ్రవాద సంస్థ హమాస్ యొక్క అత్యంత ముఖ్యమైన బ్రిగేడ్‌ అని వెల్లడించింది. అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై దాడి, మారణకాండలో ఈ బెటాలియన్‌ కీలక పాత్ర పోషించినట్లు తెలిపింది. ఇజ్రాయెల్‌లో దాదాపు 85,000 మంది భారతీయ మూలాలున్న యూదులు ఉన్నారు. యుద్ధంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడి ప్రజలే కాదు. విదేశీ పర్యటకులు కూడా చాలా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు.

You may also like

Leave a Comment