Telugu News » Chandrababu Letter: నన్ను అంతమొందించేందుకు కుట్ర.. జడ్జికి చంద్రబాబు లేఖ..!

Chandrababu Letter: నన్ను అంతమొందించేందుకు కుట్ర.. జడ్జికి చంద్రబాబు లేఖ..!

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబు ఏసీబీ కోర్టు జడ్జి(ACB court judge)కి ఓ లేఖ రాశారు. జైలు అధికారుల ద్వారా ఏసీబీ జడ్జికి చంద్రబాబు ఆ లేఖను పంపించారు.

by Mano

తనను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(TDP Chief Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబు ఏసీబీ కోర్టు జడ్జి(ACB court judge)కి ఓ లేఖ రాశారు. జైలు అధికారుల ద్వారా ఏసీబీ జడ్జికి చంద్రబాబు ఆ లేఖను పంపించారు. ఈనెల 25న చంద్రబాబు లేఖ రాయగా ఆయన భద్రత, ఆరోగ్యంపై కీలక విషయాలను వెల్లడించారు. ఆ లేఖ మూడు పేజీలు ఉంది.

Chandrababu Letter: Conspiracy to kill me.. Chandrababu's letter to the judge..!

‘నాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. నేను జైల్లోకి వచ్చినప్పుడు అనధికారికంగా నన్ను వీడియోలు, ఫొటోలు తీశారు. ఆ ఫుటేజీని స్వయంగా పోలీసులే లీక్ చేశారు. నా రెప్యూటేషన్‌ను దెబ్బతీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు. నన్ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారు. దీనికి సంబంధించిన లేఖను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఈ విషయమై లేఖ కూడా వచ్చింది. ఆ లేఖపై ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదు..’ అంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

‘నా భద్రతే కాదు.. నా కుటుంబ సభ్యులకు ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనతో ఉన్నా. నాలుగున్నరేళ్ల కాలంలో నాపై వివిధ సందర్భాల్లో అధికారంలో ఉన్న వాళ్లు దాడులు చేశారు. గంజాయి ప్యాకెట్లు జైలు ప్రాంగణంలో గార్డెనింగ్ చేస్తున్న ఖైదీల వద్దకు విసిరేస్తున్నారు’ అంటూ చంద్రబాబు లేఖలో చెప్పుకొచ్చారు.

రాజమండ్రి సెంట్రల్‌ జైలులో తన భద్రతపై కూడా చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. ఎస్ కోటాకు చెందిన ఓ ముద్దాయి జైల్లో పెన్ కెమెరాతో విజువల్స్ తీస్తున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. తన కదలికల కోసం జైలుపై అనధికారికంగా డ్రోన్లు ఎగరేస్తున్నారని, ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఈ డ్రోన్లు ఎగరేశారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 6వ తేదీన తనను కలవడానికి వచ్చిన కుటుంబసభ్యులు వచ్చిన సందర్భంలో సెంట్రల్ జైలు మెయిన్ గేట్ వద్ద మరో డ్రోన్ ఎగరేశారని తెలిపారు.

You may also like

Leave a Comment